AP-TG: నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది.కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని నోటిఫై చేస్తూ జల్‌శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
FotoJet (2)

Center's key decision to resolve river water disputes

AP-TG : తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం  కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది.కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని నోటిఫై చేస్తూ జల్‌శక్తి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సభ్యులుగా కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్‌ ఇంజినీర్, సీడబ్ల్యూసీ చీఫ్‌ ఇంజినీర్. రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు స్థానం కల్పించింది.  నదీ జలాల వివాదాల పరిష్కరానికి కమిటీని జల్‌శక్తి శాఖ నోటిఫై చేసింది.

 కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో.. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటుచేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తోంది. ఉదాహరణకు.. కృష్ణానది జల వివాద పరిష్కారానికి 6 అక్టోబర్ 2023నాడు KWDT-2ను (Krishna Water Dispute Tribunal) ఏర్పాటుచేసి.. అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ను నిర్దేశించింది. రెండేళ్ల కాల వ్యవధి కలిగిన ట్రిబ్యునల్‌ 1 ఆగస్టు, 2025 నాడు ముగియగా.. కృష్ణాజలాల వినియోగంపై వాదనలు నడుస్తున్నందున.. దీన్ని మరో ఏడాది (31 జూలై, 2026) పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తోంది. 

 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9, సెక్షన్ 84 ప్రకారం.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోసం APEX కౌన్సిల్ ఏర్పాటైంది. 16, జూలై 2025 నాడు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ (జల్‌శక్తి) మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన APEX కౌన్సిల్ సమావేశంలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తావించగా.. వాటిని చర్చించి, సాంకేతికతంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని APEX కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని సూచించింది. డిసెంబర్ 23, 2025 నాడు తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయడంతో ఇవాళ (శుక్రవారం) కేంద్ర జలవనరుల సంఘం కొత్త కమిటీని నోటిఫై చేసింది.

Advertisment
తాజా కథనాలు