Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు..మూడు నెల్లకో బ్లాస్ట్..జైషే మొహమ్మద్ ప్లాన్

ఢిల్లీ బాంబు పేలుడు వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంస్థ మూడు నెలల ప్యాట్రన్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడికి, పుల్వామా ఉగ్రదాడికి సంబంధాలు కనబడుతున్నాయని చెబుతున్నారు.

New Update
bomb

ఢిల్లీ ఉగ్రదాడితో మొత్తం దేశం అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎర్రకోట దగ్గరలో పేలిన బాంబు దాడిలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ బాంబు దాడి వెనుక ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుల్వామాలో సైనికులపై జరిగిన దాడి..ప్రస్తుత దాడి ఒకే పోలికలు కలిగి ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు ఆ సంస్థ అనుసరించే మూడు నెలల కార్యాచరణకు కు ఇది దగ్గరగా ఉందని అంటున్నారు.

తమ ఉనికిని చాటుకునేందుకు మూడు నెల్లకో దాడి..

ఇంటెల్ వర్గాలు సూచించిన ప్రకారం జైష్ ఎ మొహమ్మద్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ సంస్థ తన మూడు నెలల కార్యాచరణను మళ్ళీ అమల్లోకి తీసుకువచ్చిందని చెబుతున్నారు వీరి పాత అలవాటు ప్రకారం మూడు నెల్లకో సారి దాడి చేయడం పరిపాటి. గతంలో పరిశీలిస్తే ఏప్రిల్ లో పహల్గాం దాడి జరిగిన తర్వాత జూలైలో ఒకసారి దాడికి జైష్ ఎ మొహమ్మద్ ప్రయత్నించింది. మహదేవ్ ఆపరేషన్ పేరుతో దీనిని భారత సైన్యం తిప్పి కొట్టింది. దాడి జరగకుండా ఆపింది. ఇప్పుడు మళ్ళీ మూడు నెలల తర్వాత ఢిల్లీలో బాంబు దాడకి పాల్పడి ఉండవచ్చునని ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. దాంతో పాటూ ఢిల్లీ బాంబు పేలుడికి, పుల్వామా దాడికి సంబంధాలున్నాయని...రెండూ ఒకే రీతిలో జరిగాయని చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థలు తమ ఉనికి చాటుకునేందుకు తరుచూ ఇలాంటి పేలుళ్ళకు పాల్పడుతుంటాయని అంటున్నారు.

చెల్లాచెదురుగా శరీర భాగాలు..

మరోవైపు బాంబు పేలిన తర్వాత ఎర్రకోట దగ్గర భీతావహ పరిస్థితులు నెలకున్నాయి. పేలుడు ధాటికి శరీర భాగాలు ఛిద్రమై..రోడ్డు, వాహనాలపై పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు చెప్పారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయని, సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్‌లోని దుకాణాల అద్దాలూ కూడా పగిలిపోయాయని తెలిపారు. తాను ఓ వ్యక్తితో మాట్లాడుతున్నానని.. అంతలోనే ఓ చేయి భాగం తన వెనుకే పడినట్లు అమిత్ ముద్గల్ అనే వ్యక్తి పీటీఐతో తెలిపారు. కొన్ని సెకన్లలోనే మంటలు, పొగతో ఈ ప్రాంతం నిండిపోయింది. అందరూ ప్రాణభయంతో హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

Also Read: BIG BREAKING: హైదరాబాద్ లో మంచినీళ్లు, ప్రసాదాల్లో విషం.. బయటపడ్డ భయంకర ఉగ్రకుట్ర!

Advertisment
తాజా కథనాలు