/rtv/media/media_files/2026/01/13/vijay-2026-01-13-19-37-44.jpg)
Vijay
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ హిరో, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సోమవారం విజయ్ సీబీఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే మరోసారి హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో టీవీకే పార్టీ కరూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనపై సీబీఐ విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత విజయ్‌ను విచారిస్తోంది.
Follow Us