/rtv/media/media_files/2025/11/04/campaign-period-for-bihar-first-phase-assembly-elections-concludes-2025-11-04-16-38-22.jpg)
campaign period for Bihar first phase Assembly elections concludes
బీహార్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార సమయం ముగిసింది. నవంబర్ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార, విపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు సంచలన హామీలు ప్రకటించాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో బీహార్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోడ్ అమల్లో ఉందని.. ప్రజలు ఎక్కడా గుమికూడదని ఆదేశించారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేవరకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం.. రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి
ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్ కూటమికి చెందిన స్టార్ క్యాంపెయినర్లు విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్డీయే తరఫున జేడీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం చేశారు. ఇక విపక్ష కూటమి తరఫున రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ సహా ఇతర నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. మరి ఈసారి బీహార్ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే.
Also Read: పో*ర్న్ సైట్లు నిషేధించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us