/rtv/media/media_files/2025/07/15/exchange-2025-07-15-10-54-16.jpg)
Bombay Stock Exchange
వ్యాణిజ్య రాజధాని ముంబై లోని కోట్లలో వ్యాపారం జరిగే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. భవనాన్ని బాబులతో పేల్చేస్తామంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఐడీతో గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ టవర్ భవనంలో 4 RDX, IED బాంబులను ఉంచారని, అది మధ్యాహ్నం 3 గంటలకు పేలిపోతుందని అందులో రాశాడు.
Bombay Stock Exchange received an email threatening to blow it up. The police were immediately informed. The bomb squad team and police reached the spot. Nothing suspicious was found.
— Mint (@livemint) July 15, 2025
Read more: https://t.co/xWZ4ACKMJxpic.twitter.com/UgVAUm9ss6
ఫేక్ ఐడీతో బాంబు బెదిరింపు మెయిల్..
దీంతో వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి మొత్తం స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాన్ని తనిఖీ చేయించారు అయితే వారికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఈ కేసులో, MRA మార్గ్ పోలీస్ స్టేషన్‌లో తెలియని వ్యక్తిపై BNS సెక్షన్ 351(1)(b), 353(2), 351(3), 351(4) కింద కేసు నమోదు చేశారు. ఈ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది. ఫేక్ ఐడీ వెనుక ఉన్న వ్యక్తి అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం నాడు బిఎస్ఇ అధికారిక వెబ్‌సైట్‌లో ఈమెయిల్ ద్వారా పేలుడు బెదిరింపు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.
అంతకు ముందు అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ కూడా ఇటువంటి బెదిరింపే వచ్చింది. స్వర్ణ దేవాలయం యొక్క లంగర్ హాల్‌ను RDX ఉపయోగించి పేల్చివేస్తామని మెయిల్ చేశారు.
Also Read: Stock Market: మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు..లాభాల్లో సూచీలు