/rtv/media/media_files/2026/01/16/bjp-shiv-sena-alliance-crosses-halfway-mark-in-mumbai-2026-01-16-17-36-51.jpg)
BJP-Shiv Sena Alliance Crosses Halfway Mark In Mumbai
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలుపు దిశగా వెళ్తోంది. గురువారం అక్కడ ఎన్నికలు జరగగా శుక్రవారం ఉదయం 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ముఖ్యంగా బృహణ్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌లోని (BMC) 227 వార్డుల్లో మహాయుతి కూటమి 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక శివసేన (UBT) కూటమి 81 వార్డుల్లోనే ముందంజంలో ఉంది. ఇతరులు 23 స్థానాల్లో దూసుకుపోతున్నారు.
Also Read: మహారాష్ట్ర ఎన్నికల్లో గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు గెలుపు
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్‌లలో 2,869 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి 1667 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శివసేన (UBT) కూటమి కేవలం 200 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇతరులు 715 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Also Read: 4 ఏళ్లలో 3.3 లక్షల మంది దుర్మరణం..బైక్ ప్రమాదాల్లో చనిపోతున్న జనాలు
Follow Us