Wedding: ప్రముఖ సింగర్‌ను పెళ్లి చేసుకున్న బీజేపీ ఎంపీ

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రముఖ గాయని, డ్యాన్సర్‌ అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను గురువారం పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
BJP MP Tejasvi Surya marries Carnatic singer Sivasri Skandaprasad in Bengaluru

BJP MP Tejasvi Surya marries Carnatic singer Sivasri Skandaprasad in Bengaluru

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రముఖ గాయని, డ్యాన్సర్‌ అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను గురువారం పెళ్లి చేసుకున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఈ వేడుకకు కేంద్రమంత్రులు అర్జున్‌ రామ్ మేఘవాల్, వి సోమన్న, బీజేపీ నేతలు అన్నామలై, అమిత్ మాలవీయ, బీవై విజయేంద్ర తదితరలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!

తేజస్వీ సూర్య దేశంలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వృత్తిరీత్యా ఆయన లాయర్‌ అయినప్పటికీ రాజకీయాల మీద ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చారు. బెంగళూరు సౌత్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. అలాగే భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.

Also Read: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు

ఇక తేజస్వీ సూర్య పెళ్లి చేసుకున్న శివ శ్రీ స్కంద ప్రసాద్‌.. శాస్త్ర విశ్వవిద్యాలయంలో బయో ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత మద్రాసు యూనివర్సిటీ నుంచి భరత నాట్యంలో ఎంఏ, మద్రాసు సంస్కృత కళాశాలలో సంస్కృతంలో కూడా ఎంఏ పట్టా అందుకున్నారు. అంతేకాదు పొన్నియన్ సెల్వన్ పార్ట్‌ 2 లో కన్నడ వర్షన్‌లో ఆమె ఒక పాట కూడా పాడారు. ఆ పాటతో బాగా వైరల్ అవ్వడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు శివశ్రీ స్కంద ప్రసాద్ అనే పేరుతో ఆమె యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నడుపుతోంది. ఆ ఛానల్‌కు 2 లక్షల 25వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు