/rtv/media/media_files/2025/07/12/bjp-leader-antics-in-the-cemetery-2025-07-12-16-10-12.jpg)
BJP leader antics in the cemetery
Crime: నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ రాజకీయ నాయకుడు పట్టపగలు ఓ మహిళతో రాసలీలలు కొనసాగిస్తూ స్థానికులకు చిక్కాడు. అది కూడా స్మశానంలో కారునిలిపి కారులోనే పాడు పని చేస్తూ బుక్కయ్యాడు. స్థానికులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో తమను వదిలిపెట్టాలని కాళ్ల బేరానికి వచ్చాడు. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన బీజేపీ పార్టీ నాయకుడు రాహుల్ బాల్మికి స్థానికంగా రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. అయితే అతను ఓ వివాహిత మహిళను తీసుకుని కారులో స్థానికంగా ఉండే స్మశానవాటికకు వచ్చాడు. కారును అక్కడ నిలిపి మహిళతో రాసలీలల్లో మునిగిపోయాడు.
#बुलंदशहर में BJP नेता श्मशान घाट के अंदर गाड़ी में शादीशुदा महिला के साथ #रंगरेलियां मनाते हुए दबोच लिये गये.. pic.twitter.com/tLT0d4C8Cl
— News Art (न्यूज़ आर्ट) (@tyagivinit7) July 12, 2025
Also Read:Superman Trailer: పదేళ్ళ తర్వాత మళ్లీ రాబోతున్న 'సూపర్‌మ్యాన్' .. ట్రైలర్ భలే ఉంది!
అయితే చాలాసేపటి నుంచి స్మశానవాటికలో కారు నిలిపి ఉండటం చూసిన స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే కారు దగ్గరికి వచ్చి పరిశీలించారు. కారులో రాహుల్ బాల్మికి మహిళతో శృంగారంలో మునిగి తేలడం గుర్తించారు. స్థానికులు రావడాన్ని గమనించిన రాహుల్ వెంటనే సర్దుకున్నాడు. దాంతో కారులో నుండి బయటకు రావాలని స్థానికులు కోరారు. బయటకు వచ్చిన వారు తమను వదిలేయాలంటూ స్థానికుల కాళ్లు పట్టుకున్నారు. ఈ క్రమంలో వారిని స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బీజేపీ షెడ్యూల్డ్ కాస్ట్ ఫ్రంట్ నాయకుడిగా ఉన్న రాహుల్ కు స్థానికంగా మంచి గుర్తింపు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో బయటకు రావడంతో రాహుల్ పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై బీజేపీ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read:Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!