పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. భారత రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై గురువారం పార్లమెంటు ఆవరణలో అధికార, విపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. ఇద్దరు బీజేపీ ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. రాహుల్ గాంధే తమ ఎంపీలను తోసేశారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే తాజాగా ఈ ఘటనపై రాహల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ''పార్లమెంటులో అదానీ కేసుపై చర్చ జరగకూడదనేదే బీజేపీ వ్యూహం. ఇందుకోసం ఏదో ఒక అడ్డంకిని సృష్టిస్తూనే ఉన్నారు. Also Read: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు అంబేద్కర్‌ను అవమానించినందుకు ఈరోజు పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టాం. మకర ద్వారం వద్ద బీజెపీ ఎంపీలు మమ్మల్ని అడ్డుకున్నారు. ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు తోపులాట ఘటనని తెరపైకి తెచ్చారు. అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు చెప్పి, రాజీనామా చేయాలి. దేశాన్ని అదానికి మోదీ అమ్మేస్తున్నారు. దీనిపై సభలో చర్చ జరగకూడదనే బీజేపీ కోరుకుంటుందని'' రాహుల్ గాంధీ అన్నారు. LIVE: Press Conference | AICC HQ, New Delhi https://t.co/OkNrmTKhyX — Rahul Gandhi (@RahulGandhi) December 19, 2024 మరోవైపు రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. పార్లమెంటు బయట రాహుల్ తోయడం వల్లే తమ పార్టీ ఎంపీలు గాయపడ్డారని ఆరోపిస్తోంది. తోటి ఎంపీలపై దాడి చేసేందుకు రాహుల్‌కు ఏ చట్టం అధికారమిచ్చిందని ప్రశ్నించారు. సహచర ఎంపీలను కొట్టేందుకు రాహుల్ కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైటర్లు వేశారు. Also Read: అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు ఇదిలాఉండగా.. రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ కొన్యాక్ కూడా ఆరోపణలు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేస్తు్న్న సమయంలో నాతో అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. రాహుల్ ప్రవర్తనతో ఇబ్బందిగా ఫీలయ్యానని అన్నారు. రాజ్యసభలో కూడా ఆమె ఈ అంశంపై మాట్లాడారు. అనంతరం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్‌కు లేఖ రాశారు.