విమానం రెక్కలో పక్షి గూడు.. కంగుతిన్న ముంబై ఎయిర్‌పోర్ట్ సిబ్బంది (VIDEO)

ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు ఉంది. వెంటనే అప్రమత్తమైన ముంబై ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పక్షి గూడుకు చెందిన చిన్న కర్రలను సిబ్బంది తొలగించింది. చిన్న పక్షి గూడు కారణంగా దాదాపు 3 గంటలు విమానం ఆలస్యంగా అయ్యింది.

New Update
Bird nest on plane wing

ముంబై ఎయిర్ పోర్ట్‌లో అంటూ షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది. ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు కనిపించడంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది షాక్‌కు గురైయ్యారు. ఓ ప్రయాణికుడు పక్షి గూడును గుర్తించి ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్‌కి చూపించాడు. సదరు విమానం ఎయిర్ ఇండియా సంస్థకు చెందనట్లు తెలుస్తోంది.

ఎయిర్ హోస్టెస్ అప్రమత్తమై పైలట్‌కి చూపించడంతో.. వెంటనే గ్రౌండ్ స్టాఫ్‌కు కాల్ చేశారు. గంటలపాటు శ్రమించి విమానంలో పక్షి గూడుకు చెందిన చిన్న కర్రలను  సిబ్బంది తొలగించింది. చిన్న పక్షి గూడు కారణంగా దాదాపు 3 గంటలు విమానం ఆలస్యమైందని వార్తలు వైరల్ అవుతున్నాయి. నెల రోజుల క్రితం అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు