Bihar Polling: చలిని లెక్క చేయకుండా పోలింగ్ బూత్‌లో ఓటర్లు!

బిహార్‌లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. భారీ చలిలో కూడా ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గరకు చేరుకున్నారు. ఉదయాన్నే ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలి తీవ్రంగా ఉన్నా కూడా ఓటర్లు స్వెటర్లు ధరిస్తూ ఓటు వేస్తున్నారు.

New Update
Bihar elections

Bihar elections

బిహార్‌లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. భారీ చలిలో కూడా ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గరకు చేరుకున్నారు. ఉదయాన్నే ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలి తీవ్రంగా ఉన్నా కూడా ఓటర్లు స్వెటర్లు ధరిస్తూ ఓటు వేస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ రెండో దశలో ఓటింగ్ చేయడానికి దాదాపుగా 3.70 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మొత్తం 45 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపుగా 40 వేల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు