Bihar Polling: మార్పు కోసం మాత్రమే ఓటు వేయండి: ప్రశాంత్ కిషోర్

మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో మార్పు తీసుకురావడానికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. బీహార్‌లో మార్పు కోసం ఓటు వేయండి. మీ పిల్లల విద్య, ఉపాధి కోసం ఓటు వేయండని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

New Update
Prasanth Kishore

Prasanth Kishore

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ దశ పోలింగ్ జరుగుతోంది. చలిని తట్టుకుని కూడా ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గరకు చేరుకున్నారు. నిజానికి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటర్లు ముందే చేరుకున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా  జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో మార్పు తీసుకురావడానికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. నేడు చివరి దశవ పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదు చేయమని బీహార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. బీహార్‌లో మార్పు కోసం ఓటు వేయండి. మీ పిల్లల విద్య, ఉపాధి కోసం ఓటు వేయండి. కొత్త వ్యవస్థను సృష్టించడానికి మొదటి దశలో మీరు చేసిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఓటు వేయండి. మీ పిల్లలకు విద్య, ఉపాధిని అందించే వ్యవస్థను ఎంచుకోండని తెలిపారు. ఈరోజు మీరు తప్పు చేస్తే..  మిమ్మల్ని పీడిస్తున్న అదే వ్యవస్థతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవినీతితో రాబోయే ఐదు సంవత్సరాలు గడపవలసి ఉంటుందని ఆయన అన్నారు. 

ఇది కూడా చూడండి: Bihar Polls: 3.7 కోట్లమంది ఓటర్లు.. బిహార్ రెండో దశ పోలింగ్ స్టార్ట్!

ఇది కూడా చూడండి: Bihar Polling: చలిని లెక్క చేయకుండా పోలింగ్ బూత్‌లో ఓటర్లు!

Advertisment
తాజా కథనాలు