Nitish Kumar : ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిహార్ దర్భంగాలో ఉప ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పీఎం మోదీ కాళ్లు మొక్కేందుకు నితీశ్ ప్రయత్నించడం చర్చనీయాంశమైంది.
Also Read : ఫస్టాఫ్ అద్భుతం,సెకండాఫ్ అంతకు మించి.. రష్మిక పోస్ట్ వైరల్
Also Read : నాగ చైతన్య కు ఉన్న ఆ అలవాటు వల్లే సమంత విడాకులు ఇచ్చిందా?
అటు రావాలంటూ సైగ చేసిన మోదీ..
ఈ మేరకు సభా వేదికపై మోదీ కూర్చొని ఉండగా అటు వైపు వచ్చిన నితీశ్ ను తన పక్కనున్న కుర్చీలో కూర్చొమంటూ మోదీ సైగ చేశారు. ఈ క్రమంలోనే మోదీ పాదాలను తాకేందుకు ట్రై చేశాడు నితీశ్. దీంతో వెంటనే నిలబడిన ప్రధాని.. తన పాదాలను తాకొద్దంటూ నితీశ్ చేతులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక బిహార్‌లోని నవాడాలో ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలోనూ మోదీ పాదాలను తాకేందుకు సీఎం నితీశ్ ప్రయత్నించారు.
ఇది కూడా చదవండి: DHARANI: త్వరలో ముగియనున్న ధరణి కథ.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే!
ఇదిలా ఉంటే.. బిహార్‌లో నీతీశ్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మోదీ అభినందించారు. ఆటవిక రాజ్యంగా ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని, గత ప్రభుత్వాలు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేశాయని విమర్శించారు. నీతీశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర పరిస్థితి మెరుగుపడిందని కొనియాడారు.
ఇది కూడా చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' ఫస్ట్ సింగిల్.. వెంకీ మామ కోసం రమణ గోగుల పాట