Super Moon: కార్తీక పౌర్ణమి రోజున ఆకాశంలో అద్భుత దృశ్యం

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. నవంబర్ 5న (బుధవారం) ఆకాశంలో చంద్రుడు సాధారణం కన్నా పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. దీనిని బీవర్‌ సూపర్‌ మూన్‌ అని పిలుస్తారు.

New Update
Biggest Moon of the year to rise tonight, These cities will see supermoon

Biggest Moon of the year to rise tonight, These cities will see supermoon

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. నవంబర్ 5న (బుధవారం) ఆకాశంలో చంద్రుడు సాధారణం కన్నా పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. దీనిని బీవర్‌ సూపర్‌ మూన్‌ అని పిలుస్తారు. పౌర్ణమి సమయంలో చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా వస్తాడు. ఆ సమయంలోనే అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.       

Also Read: షాకింగ్ వీడియో: నదిలో భక్తుల పడవ బోల్తా.. అరుపులు కేకలతో గందరగోళం

అయితే గతంలో కూడా ఇలాంటి దృశ్యం చైనాలో కనిపించింది. ఈసారి చంద్రుడు భూమికి మరింత దగ్గరగా ఉంటాడు. ఈ సూపర్‌మూన్ అనేది ఈ ఏడాదిలో ఏర్పడబోయే రెండోది. నార్త్‌ అమెరికాలోని స్థానిక తెగల నుంచి దీనికి బీవర్ సూపర్ మూన్‌గా పేరు వచ్చింది. వాస్తవానికి చంద్రుడు భూమి చుట్టు తిరిగే కక్ష్య అనేది పూర్తిగా వృత్తాకారంగా ఉండదు. కానీ కక్ష్యలో తిరిగే సమయంలో మాత్రం భూమికి చంద్రుడు దగ్గరగా వస్తుంటాడు, అలాగే దూరంగా వెళ్తుంటాడు. అయితే పౌర్ణమి రోజున చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చిన వచ్చిన దృశ్యాన్నే సూపర్‌మూన్‌ అని పిలుస్తారు. 

Also Read: మరో దారుణం.. మహిళల హాస్టల్ టాయిలెట్‌లో స్పై కెమెరాలు

ఆ సమయంలో భూమి నుంచి చంద్రుడు దాదాపు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. దీనివల్ల సాధారణ పౌర్ణమి కన్నా 7 శాతం పెద్దదిగా ఉంటుంది. ఈ ప్రభావానికి చంద్రుడు 16 శాతం ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. టెలీస్కోప్‌తో చంద్రుడిని చూస్తే స్పష్టంగా చూడొచ్చు. 

Advertisment
తాజా కథనాలు