కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. కొండారెడ్డి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ సోదరులు వేధింపుల వల్లే చనిపోతున్నారంటూ ఓ సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని.. కక్షపూరితంగా తన ఇంటికి దారి లేకుండా చేశారని సాయిరెడ్డి పేర్కొన్నారు. కొన్నిరోజులుగా తనను వేధిస్తున్నారని.. మనస్థాపంతో చనిపోతున్నానంటూ లేఖలో పేర్కొన్నారు.
Also Read: హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫార్మా కంపెనీలు
ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం కలచివేసిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్నటువంటి దారుణ పరిస్థితులకు సాయిరెడ్డి ఆత్మహత్యే నిదర్శమని తెలిపారు. '' రేవంత్ నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్‌ను ఆత్మహత్య చేసుకునేలా చేసిన వాళ్లపై చట్టరీత్యా చర్యలకు సిద్ధమేనా ? మీ అన్నదమ్ముల్లా అరచకాలు శృతి మించాయని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా ?
సాయిరెడ్డికి కారణమైన మీ అన్నదమ్ముల్లపై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలని'' హరీశ్ రావు ఎక్స్ లో డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ రాసిన సూసైడ్ నోట్‌ను కూడా జత చేశారు. సీఎం సొంత గ్రామంలో జరిగిన ఈ ఘటనపై హై టెన్షన్ నెలకొంది. ఇటీవల లగచర్ల ఘటన అంశం కూడా రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిపిందే. రేవంత్ బంధువుల కోసం ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు పేదల భూములు లాక్కుంటున్నారంటూ బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఇంకా రేవంత్ సర్కార్ స్పందించలేదు.
Also Read: రేవంత్‌కు బిగ్ షాక్.. కలెక్టర్ల రహస్య సమావేశం
Also Read: టార్గెట్ బీఆర్ఎస్.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదే!