/rtv/media/media_files/2025/04/05/RX6weqS5SK8Aoj1I1hD2.jpg)
Maoist party
BIG BREAKING: వరుస ఎన్ కౌంటర్ లతో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా ఎస్పీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళా మావోయిస్టులతో సహా 22 మంది ఉన్నారు. లొంగిపోయిన వారిలో కుతుల్ ఏరియా కమిటీ కమాండర్ సుక్‌లాల్ ఉన్నారు. కాగా లొంగిపోయిన మావోయిస్టులపై రూ.37 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా లొంగిపోయిన వారికి రివార్డు అందజేయడంతో పాటు వారి పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read: Bahubali: శివగామితో బాహుబలి, భల్లాలదేవ.. పదేళ్ల బాహుబలి ముచ్చట్లు! ఫొటోలు చూశారా
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా తుడిచిపెడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శపథం చేసిన నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాటు ప్రాధాన్యం సంతరించుకుంది.షా మాట్లాడుతూ.. మావోయిస్టులు లేని భారత్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. మావోయిస్టుల ఏరివేత మిషన్‌కు సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) వెన్నెముకగా నిలిచిందని ప్రశంసించారు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు 70శాతానికి పైగా తగ్గి ఇప్పుడు ముగింపు దశకు చేరాయన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడం కోసం ప్రత్యేక కోబ్రా దళాన్ని ఏర్పాటుచేశామన్నారు.
Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్
Also Read: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్