స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టులు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. BSF- 15,654, CISF- 7145, CRPF- 11,541, SSB- 819, ITBP- 3017, AR- 1248, SSF- 35, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)- 22 వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష
ఇప్పటికే ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష తేదీలు ఖరారు అయ్యాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షని ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఏర్పాటు చేసింది. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.
Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?
గతంలో తేదీలు
గతంలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎగ్జామ్ తేదీలు వెల్లడించగా.. తాజాగా ఆ తేదీల్లో మార్పులు జరిగాయి. గతంలో కానిస్టేబుల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read: అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..ఆ విషయంలో అమెరికా ఫెయిల్!
సవరించిన తేదీలు
కానీ ఇప్పుడు ఆ తేదీల్లో మార్పులు సంభవించాయి. తాజా ప్రకటనతో.. SSC GD కానిస్టేబుల్ 2025 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు CRPF అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. మొత్తంగా 14 రోజుల పాటు కానిస్టేబుల్ పరీక్ష ఆన్‌లైలో నిర్వహించనున్నారు.
Also Read: 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్ కు కియారా అందుకే రావట్లేదా..?