Hathras Stampede : తొక్కిసలాట ఘటనలో భోలే బాబాకు క్లీన్ చిట్ !

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన భయంకరమైన తొక్కిసలాట సంఘటనపై న్యాయ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో భోలే బాబాకు క్లీన్ చిట్ లభించింది. 2024లో జరిగిన ఈ తొక్కిసలాటలో  121 మంది ప్రాణాలు కోల్పోయారు. 

author-image
By Krishna
New Update
bhole baba 1

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని హత్రాస్‌లో జరిగిన భయంకరమైన తొక్కిసలాట సంఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో భోలే బాబా (Bhole Baba) కు క్లీన్ చిట్ ఇచ్చింది.  తొక్కిసలాటకు నిర్వాహకులే ప్రాథమికంగా బాధ్యులని, పోలీసుల నిర్లక్ష్యం కూడా తీవ్రంగా ఉందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి జ్యుడీషియల్ కమిషన్ కొన్ని ముఖ్యమైన సూచనలను ఇచ్చింది. ఏదైనా పెద్ద కార్యక్రమానికి ముందు, పోలీసు అధికారులు స్వయంగా వేదికను తనిఖీ చేయడం తప్పనిసరి అని తెలిపింది.

Also Read :  ఎఫ్‌బీఐ డెరెక్టర్‌గా ట్రంప్ విధేయుడు..ఇంతకీ ఈ భారతీయుడు ఎవరో తెలుసా!

కాగా  హత్రాస్  తొక్కిసలాట ఘటనపై  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.  రిటైర్డ్ ఐపీఎస్ భవేష్ కుమార్ సింగ్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ హేమంత్ రావులను కమిషన్ సభ్యులుగా నియమించారు. కాగా ఈ కేసులో పోలీసులు 11 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు పోలీసులు.  

Also Read :  ఐదుసార్లు ఎమ్మెల్యే, ప్రజా ఉద్యమకారుడు..కానీ అవమానించారు

Also Read :  కొడుకుకి ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న పురస్కారం..కానీ ఇంతలోనే తండ్రి..!

121 మంది మృతి 

2024న జూలై 2వ తేదీన  ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు.  జనసమూహ నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు నలిగిపోయి ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.  సత్సంగ్‌లో ప్రవచనాలు బోధించిన  భోలే బాబా పాద ధూళి కోసం భక్తులు ఒక్కసారిగా వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. తొక్కిసలాటలో చనిపోయినవారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు.  ఇక భోలే బాబా అసలు పేరు సూరజ్‌పాల్ జాటవ్. ఆయన్ను నారాయణ్ సాకార్ హరి అని కూడా పిలుస్తుంటారు. ఒకప్పుడు పోలీసు కానిస్టేబుల్ అయిన సూరజ్‌పాల్ జాటవ్ ఉద్యోగాన్ని వదిలేసి ఆయన ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు.  

Also Read :  పురిట్లో బిడ్డను కోల్పోయిన తల్లులకు గుడ్ న్యూస్.. ఆ రాష్ట్రంలో 60 రోజుల పాటు సెలవులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు