AP: ఏపీలో రెండు రోజుల పాటూ దంచికొట్టనున్న వానలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. దీని వలన ఉత్తరాంధ్రలో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. By Manogna alamuru 17 Dec 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడుతుందని.. తరువాత అక్కడి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. దీని కారణంగా ఏపీలో చాలా ప్రాంతాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రెండు రోజులు వర్షాలు.. రేపు విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే కోస్తాలో కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతారణశాఖ అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్ 19, గురువారం కూడా కొన్ని ప్రాతాల్లో వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆంధ్రాలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయని వాతావరణశాఖ చెబుతోంది. ఇప్పటికే మన్యం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు పడిపోయాయి. ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత ఎక్కువ కానుంది. Also Read: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి