భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో ప్రపంచానికి పోటీ ఇస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాలు అయితే అన్ని విషయాల్లోనూ నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్ లాంటి వాఇల్లో అయితే ఒకదానిని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. అయితే ఎన్ని వచ్చినా ఈ విషయంలో బెంగళూరును బీట్ చేసేవారే లేరు. ఇప్పుడు బెంగళూరు మర విషయంలో కూడా టాప్‌గా నిస్తోందిట. ఇది వినడానికి కొంత వింతైన విషయమే అయినా చెప్పుకోక తప్పదు. టెక్ సిటీ ఇప్పుడు కండోమ్ సిటీగా మారుతుందని చెబుతున్నారు.
రాత్రి 10 నుంచి 11 మధ్యలో..
ఏటీ కండోమ్ సిటీనా...ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా...అందులో ఆంత ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదండి. దేశంలో అత్యంత ఎక్కువగా కండోమ్స్ బెంగళూరులో అమ్ముడుపోతున్నాయని చెబుతోంది స్విగ్గీ. స్విగ్గీ ఇన్స్టా మార్ట్‌లో రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో అత్యంత రహస్యంగా ఇకడ కండోమ్స్ సేల్ అవుతున్నాయి చెప్పింది. దీని తర్వాత స్థానంలో ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. రాత్రి 10 గంటల తర్వాత కస్టమర్లు ఎక్కువగా కండోమ్‌లే కొనుగోలు చేస్తున్నట్లుగా తెలిపింది ఇన్స్టామార్ట్. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇవే ఎక్కువగా కొంటున్నట్లుగా వెల్లడించింది. 140 ఆర్డర్స్‌లో ఒక సెక్స్ వెల్నెస్ ఐటెమ్ ఉంటుందని తెలిపింది. బెంగళూరు వాసులు కండోమ్స్ ఎక్కువగా కొనుగోలు చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వార్షిక నివేదికలో తెలిపింది. కండోమ్స్‌తో పాఊ రాత్రి పదిగంటల తర్వాత మసాలా ఫ్లేవర్ చిపస్ కుర్కురేల ఆర్డర్లు ఎక్కువగా వస్తాయి అని చెబుతోంది స్విగ్గీ ఇన్స్టామార్ట్.
Also Read: Mumbai: ఇండిగో విమానం 16గంటలు లేట్..ఎయిర్పోర్ట్‌లో ప్రయాణికులు పాట్లు