BREAKING: సరిహద్దుల్లో టెన్షన్.. భారతీయుడిపై దాడి.. నలుగురు బంగ్లాదేశ్ జాతీయులు అరెస్టు

మేఘాలయలోని సరిహద్దు ప్రాంతంలో దేశానికి చెందిన ఓ గ్రామస్తుడిపై నలుగురు బంగ్లాదేశ్ జాతీయులు దాడి చేశారు. దీంతో సరిహద్దు భద్రతా దళం (BSF), పోలీసులు కలిసికట్టుగా ఆపరేషన్ నిర్వహించి వీరిని అరెస్ట్ చేశారు.

New Update
Bangladesh

Bangladesh

మేఘాలయలోని సరిహద్దు ప్రాంతంలో దేశానికి చెందిన ఓ గ్రామస్తుడిపై నలుగురు బంగ్లాదేశ్ జాతీయులు దాడి చేశారు. దీంతో సరిహద్దు భద్రతా దళం (BSF), పోలీసులు కలిసికట్టుగా ఆపరేషన్ నిర్వహించి వీరిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఓ దుకాణం నడుపుతున్న బాల్‌స్రంగ్ ఎ మారక్ నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో కొందరు బంగ్లాదేశ్ జాతీయులు అతని దుకాణంలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. అయితే డైరెక్ట్‌గా ఇతనిపై దాడి చేయకుండా ఫస్ట కిడ్నాప్ చేసి, చేతులకు సంకెళ్లు వేసి సరిహద్దు వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో మారక్ వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ముఠా అతనిపై కాల్పులు జరిపినా, అతను వేగంగా పరిగెత్తి దగ్గరలోని ఒక ఇంట్లోకి దూరి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఈ కిడ్నాప్ ముఠా తనను చంపేందుకు ప్రయత్నించిందని, తన గొంతు కోసి ఉంటారని మారక్ ఆరోపించాడు.

ఇది కూడా చూడండి: IAF: ఆరు పాకిస్థాన్ యుద్ధ విమానాలు కూల్చేశాం.. IAF చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ముఠాను పట్టుకున్న పోలీసులు

ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బీఎస్‌ఎఫ్, మేఘాలయ పోలీసులు సంయుక్తంగా కలిసి ఒక ఆపరేషన్ ప్రారంభించారు. భారతీయుడిపై దాడి చేసిన వారు బంగ్లాదేశ్ వైపు పారిపోతుండగా పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి వారిని ఆపారు. ముగ్గురిని పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నారు. అదే సమయంలో గ్రామస్థులు మరొక అనుమానితుడిని పట్టుకున్నారు. పోలీసులు వారిని చేరుకునేలోపే ఆ నలుగురు అనుమానితులు తమ దగ్గరున్న ఆయుధాలు, డబ్బు, మొబైల్ ఫోన్లు, బంగ్లాదేశ్ పోలీసు గుర్తింపు కార్డును విసిరేశారు. పోలీసులు వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఆ నలుగురు అనుమానితులను మెఫస్ రెహమాన్ (35), జాంగీర్ అలోమ్ (25), మెరుఫుర్ రెహమాన్ (32), సయీమ్ హుస్సేన్ (30) గా గుర్తించారు. ముఠాలోని మిగిలిన వారి కోసం BSF, పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Crime: భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ అరెస్ట్‌..అక్కడ దాక్కున్న సలీమ్‌ పిస్టల్‌

Advertisment
తాజా కథనాలు