/rtv/media/media_files/2025/03/08/b0olwbCUsAHJ5NukYE4k.jpg)
Air India: ఢిల్లీ విమానాశ్రయం(Delhi Airport)లో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం వలన ఓ 82 ఏళ్ల వృద్ధురాలు, భారత సైనిక అధికారి భార్య ఆసుపత్రిపాలైంది. ఇంతకు ఏం జరిగిదంటే.. 2025 మార్చి 4వ తేదీన ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేందుకు 82 ఏళ్ల వృద్ధ మహిళకు ఆమె మనవరాలు విమాన టికెట్ తో పాటుగా వీల్‌చైర్‌ను కూడా బుక్ చేసింది. అయితే తీరా ఎయిర్ పోర్టుకు వెళ్లాక ఎయిర్ ఇండియా సిబ్బంది ఆమెకు వీల్‌చైర్ ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసిన పట్టించుకోలేదు.
Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?
దీంతో చేసేదీ లేకా ఆ వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ కౌంటర్ ముందు వృద్ధురాలు పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆమె పడిపోయినప్పటికీ ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెకు కనీసం ప్రధమ చికిత్స కూడా అందించలేదు. దీంతో పరిస్థితి మరింత దిగజారడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Also Read: హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్ సంచనల వ్యాఖ్యలు
An 82-year-old woman is in ICU following fall after a #wheelchair, which was pre-booked with #AirIndia, was delayed.
— NDTV Profit (@NDTVProfitIndia) March 8, 2025
While Air India has admitted a delay in providing a wheelchair, it has asserted it did not deny any assistance.
Read: https://t.co/FrZR9SNDGC pic.twitter.com/kze4cR1958
Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!
ఎయిర్ ఇండియాకు ఫిర్యాదు
ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఆ వృద్ధురాలి మనవరాలు పారుల్ కన్వర్ సోషల్ మీడియా వేదికగా వివరించింది. మా అమ్మమ్మ పట్ల ఎయిర్ ఇండియా సిబ్బంది చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆమెకు తక్కువ గౌరవంతో చూశారు.. సిగ్గుపడాలి అంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇండియాకు ఆమె ఫిర్యాదు చేసింది. నిర్లక్ష్యం వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ట్వీట్ చేసింది. పూర్తి వివరాలతో త్వరలో సంప్రదిస్తామని స్పష్టం చేసింది. ఈ సంఘటన తర్వాత, ఎయిర్ ఇండియాపై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. దీంతో #BoycottAirIndia, #ShameOnAirIndia వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
Also Read: షాద్నగర్లో దారుణం.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే గొంతు కోశాడు!