/rtv/media/media_files/2025/07/30/dharmasthala-1-2025-07-30-10-54-56.jpg)
కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దానికి కారణం.. అక్కడ పని చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన సంచలన ఆరోపణలు. అతను 1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో పని చేశానని చెప్పాడు. ఆ సమయంలో వందలాది మృతదేహాలను అందులోనూ మహిళలు, మైనర్ బాలికలవి ఎక్కువగా పూడ్చిపెట్టమని బెదిరించారని ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించాడు. ఈ మృతదేహాలపై అత్యాచారం, హత్యలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అతను తెలిపాడు. అతని ఆరోపణలకు దగ్గరగా ధర్మస్థలిలో హత్య కేసులు కూడా నమోదైయ్యాయి.
సౌజన్య హత్య కేసు (2012): 2012లో ధర్మస్థలలో జరిగిన 17 ఏళ్ల విద్యార్థిని సౌజన్య అత్యాచారం, హత్య కేసు ఈ వివాదంలో అత్యంత ప్రముఖమైనది. ఈ కేసులో విచారణ సరిగా జరగలేదని, ఒక వ్యక్తిని బలిపశువుగా చేసి, అసలు దోషులను తప్పించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏకైక నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
అనన్య భట్ కేసు (2003): 2003లో కాలేజీ ట్రిప్‌లో అదృశ్యమైన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ కేసు కూడా ఈ వివాదాలతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి తన కూతురి కేసును తిరిగి విచారించాలని కోరుతున్నారు.
ఆలయ ధర్మాధికారిపై ఆరోపణలు
ఈ వివాదాలు ధర్మస్థల ఆలయ నిర్వహణ, ముఖ్యంగా ధర్మాధికారి డా. డి. వీరేంద్ర హెగ్గడే, ఆయన కుటుంబంపై కూడా ఆరోపణలు ఉన్నాయి. వీరేంద్ర హెగ్గడే రాజ్యసభ సభ్యుడు, పద్మవిభూషణ్ గ్రహీత కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేరాలను కప్పిపుచ్చడంలో ఆలయ యాజమాన్యంలోని పెద్ద పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహంతి నేతృత్వంలో ఈ బృందం విచారణ చేపడుతోంది.
Dharmasthala mass burial case: Visuals from spot mazhar at Netravati Snanaghatta @thenewsminutepic.twitter.com/yvIzLlGgOZ
— Shivani Kava/ಶಿವಾನಿ (@kavashivani) July 28, 2025
ఆశ్రమంలో తవ్వకాలు
మాజీ పారిశుద్ధ్య కార్మికుడు కొన్ని అస్థిపంజరాలను సాక్ష్యంగా సమర్పించాడు. అయితే ఈ కేసు దర్యాప్తులో మరిన్ని సాక్ష్యాలు సంపాధించడానికి సిట్ టీం బుధవారం ధర్మస్థలంలో తవ్వకాలు జరిపింది. పాయింట్ 1 దగ్గర 15అడుగుల వెడల్పులో 8 అడుగుల లోతు తవ్వారు. అక్కడ ఎటువంటి అస్థిపంజరాలు లేదా భౌతిక ఆధారాలు లభించలేదు. మరింత లోతుగా తవ్వికాలు జరపడానకి సిట్ ఇతర ప్రాంతాలను పరిశీలిస్తోంది. తవ్వకాల్లో ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులు దర్యాప్తుకు సహాయం చేస్తున్నారు. మొత్తం ప్రక్రియ వీడియో రికార్డ్ చేస్తున్నారు.
Dharmasthala Case SIT Investigation| ಧರ್ಮಸ್ಥಳ ಕಾಡಿನಲ್ಲಿ ಶವಗಳ ಶೋಧ ಹಿಟಾಚಿ ಮೂಲಕ ಕಾರ್ಯಾಚರಣೆ
— Sanjevani News (@sanjevaniNews) July 29, 2025
.
.
.
.
.#dharmasthala#dharmasthalacase#dharmasthalamassburial#witness#siddaramaiah#soujanyacase#karnatakamassmurdercase#SIT#dharmasthalanews#dharmasthalamurdercasepic.twitter.com/XaDwzoKFH1
ఈ వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ధర్మస్థల ఆలయంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, దీనికి మతపరమైన కారణాలు ఉన్నాయని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. కొందరు న్యాయవాదులు, కార్యకర్తలు ధర్మస్థలలో జరిగాయని ఆరోపణలు వచ్చిన నేరాలపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ధర్మస్థల వివాదాల మాదిరిగానే, గతంలో భారతదేశంలోని ఇతర మత సంస్థలు, నాయకులపై కూడా ఇలాంటి వివాదాలు తలెత్తాయి. వాటిలో కొన్ని ..
డేరా బాబా:
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, 'డేరా సచా సౌదా' అధిపతి, కోట్లాది అనుచరులు కలిగిన ఓ మత సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అయితే, ఇతను అనేక నేరారోపణలను ఎదుర్కొని జైలు పాలయ్యాడు. 2002లో ఒక మహిళా అనుచరురాలు (సాధ్వి) రాసిన అనామక లేఖతో ఈ వివాదం మొదలైంది. ఆ లేఖలో గుర్మీత్ సింగ్ తనతో సహా పలువురు సాధ్వులను లైంగికంగా వేధించి, అత్యాచారం చేశాడని ఆరోపించింది. సీబీఐ విచారణలో ఈ ఆరోపణలు రుజువు కావడంతో, 2017 ఆగస్టు 25న పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారించింది. తీర్పు అనంతరం ఇతని అనుచరులు హింసాత్మక నిరసనలకు దిగారు. దీనివల్ల 38 మంది మరణించారు. ఆగస్టు 28న గుర్మీత్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
అత్యాచారం కేసుతో పాటు 2002లో డేరా బాబా అతని మేనేజర్ రంజిత్ సింగ్ హత్య, జర్నలిస్ట్ రామ్‌చంద్ర ఛత్రపతి హత్య కేసుల్లో కూడా గుర్మీత్ సింగ్ ప్రమేయం రుజువైంది. రంజిత్ సింగ్ అత్యాచార బాధితులకు మద్దతుగా నిలబడగా, ఛత్రపతి డేరా అక్రమాలపై వార్తలు రాశాడు. ఈ రెండు కేసుల్లోనూ గుర్మీత్‌కు జీవిత ఖైదు విధించబడింది. ప్రస్తుతం గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఈ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
అసారాం బాపు:
ఇతని అసలు పేరు అసుమల్ సిరుమలానీ హర్పలానీ. తనకు తాను మత గురువుగా ప్రకటించుకోని దేశవ్యాప్తంగా ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు. లక్షలాది మంది అనుచరులు పెట్టుకున్నాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు, ముఖ్యంగా మైనర్ బాలికపై అత్యాచారం కేసుతో ఇతని సామ్రాజ్యం కుప్పకూలింది. 2013లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో తన ఆశ్రమంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై ఆసారాం అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ బాలిక షాజహాన్‌పూర్, ఉత్తరప్రదేశ్‌కు చెందినది. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. సుదీర్ఘ విచారణ అనంతరం, 2018 ఏప్రిల్ 25న జోధ్‌పూర్ ప్రత్యేక పోక్సో కోర్టు ఆసారాం బాపును ఈ కేసులో దోషిగా నిర్ధారించింది. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. 2013 అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆశారాం, మరో అత్యాచారం కేసులో మధ్యంతర బెయిల్ పొందవలసి ఉన్నందున ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు.
నిత్యానంద బాబా:
నిత్యానంద స్వామి బెంగళూరు సమీపంలోని బిడిది ఆశ్రమానికి అధిపతి. అనేక లైంగిక వేధింపులు, అత్యాచారం, మోసం, కిడ్నాప్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. 2010లో ఓ తమిళ నటితో నిత్యానంద సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్ కావడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోల తర్వాత, నిత్యానందపై పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం, అక్రమ నిర్బంధం, మోసం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిత్యానందను అరెస్టు చేసి జైలుకు పంపారు. తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
తర్వాత నిత్యానందకు చెందిన ఆశ్రమ పాఠశాలల నుంచి తమ కుమార్తెలు కిడ్నాప్ చేయబడ్డారని, అక్రమంగా నిర్బంధించబడ్డారని కొందరు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసు గుజరాత్ హైకోర్టు వరకు వెళ్ళింది. ఈ వివాదాల మధ్య నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. అతను కైలాస అనే ప్రాంతాన్ని తన సొంత దేశంగా స్థాపించినట్లు ప్రకటించుకున్నాడు. అది ఈక్వెడార్ సమీపంలోని ద్వీపమని చెబుతున్నాడు. ఇంటర్‌పోల్ అతనిపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది.
స్వామి భగవాన్:
స్వామి భగవాన్ అసలు పేరు కృష్ణానంద్. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఆశ్రమాలు ఏర్పాటు చేసిన వివాదాస్పద మత గురువు. ఇతను మత బోధనల ముసుగులో లైంగిక వేధింపులు, మోసం, ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 2007లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఒక మైనర్ బాలికతో సహా పలువురు మహిళలపై స్వామి భగవాన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలు తీవ్ర సంచలనం సృష్టించాయి. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు స్వామి భగవాన్‌ను అరెస్టు చేశారు. ఇతని ఆశ్రమాల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని, బలవంతంగా లైంగిక సంబంధాలకు పాల్పడేలా బెదిరించారని బాధితులు ఆరోపించారు.
ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, స్వామి భగవాన్ ఆస్తులపైనా, ఆర్థిక లావాదేవీలపైనా విచారణ జరిగింది. అక్రమంగా డబ్బు సంపాదించాడని, పన్నులు ఎగవేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. మీడియాలో ఇతని భాగోతాలపై వార్తలు వచ్చాయి. చివరికి, 2008లో స్వామి భగవాన్‌ను మొరాదాబాద్ కోర్టు లైంగిక వేధింపుల కేసులో దోషిగా నిర్ధారించి, అతనికి జైలు శిక్ష విధించింది.
కంచి శంకరాచార్య
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని 2004లో ఓ ఆలయ మేనేజర్‌ను హత్య చేసిన కేసులో అరెస్టు చేశారు. తర్వాత ఆయన నిర్దోషిగా విడుదలైనప్పటికీ, ఈ కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమైయ్యాయి. మత గురువుల జవాబుదారీతనంపై తీవ్ర చర్చకు దారితీసింది.
ఓషో ఆశ్రమం
ఓషో, మొదట పుణెలో, తరువాత అమెరికాలోని ఒరెగాన్‌లో ఒక కమ్యూన్‌ను స్థాపించారు. ఆయన జీవనశైలి, ఉద్యమం తీవ్ర వివాదాలకు కారణమయ్యాయి. లైంగిక దుష్ప్రవర్తన, ఆర్థిక మోసాలు, అమెరికాలో ఆయన అనుచరులు చేసిన బయోటెర్రర్ దాడి వంటి ఆరోపణలు చాలా ఉన్నాయి.