Gurmeet Ram Rahim: డేరా బాబాకు పెరోల్ ఇవ్వడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రేప్ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు పదేపదే పెరోల్ ఇవ్వడంపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనుంచి అతనికి పెరోల్ ఇవ్వాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరని హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.