Communist Party of India (Maoist) : మావోయిస్టుల మరో లేఖ..హింసను ఆపాలంటూ..

ఛత్తీస్ గఢ్ లో కాగర్ పేరుతో జరుగుతున్న మారణకాండను ఆపడమే లక్ష్యంగా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీనిపై పార్టీ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో నాయకుడు రూపేష్ మరో లేఖ విడుదల చేశారు.

New Update
Communist Party of India (Maoist)

Communist Party of India (Maoist)

 Communist Party of India (Maoist) : ఛత్తీస్ గఢ్ లో కాగర్ పేరుతో జరుగుతున్న మారణకాండను తక్షణమే ఆపడమే లక్ష్యంగా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గతంలోనే చర్చలపై మావోయిస్టు పార్టీ చేసిన ప్రకటనపై ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయశర్మ స్పందించారు. దీనిపై మావోయిస్టు పార్టీ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో నాయకుడు రూపేష్ మరో లేఖ విడుదల చేశారు.

లేఖ సారాంశం

 Communist Party of India (Maoist)
Communist Party of India (Maoist)

 


మేము రెండు వైపుల నుండ నెలరోజుల కాల్పుల విరమణ కోరుకుంటున్నాము. శాశ్వత పరిష్కారం కోసం ముందుకు సాగుతాం.. అంటూ మొదలు పెట్టిన ఈ లేఖలో ముందుగా, శాంతి చర్చలకు సంబంధించి ఏప్రిల్ 8న నేను ఇచ్చిన మొదటి ప్రకటనపై వెంటనే స్పందించినందుకు ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా భద్రతకు హామీ ఇచ్చినందుకు, ఈ ప్రయత్నాన్ని కొనసాగించడానికి నన్ను అనుమతించినందుకు నేను వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.


కాగర్ పేరుతో జరుగుతున్న మారణకాండను తక్షణమే ఆపడమే ఈ ప్రయత్నం ముఖ్యోద్ధేశం అని మొదటి లేఖలో కూడా చెప్పాను. సమస్యను పరిష్కరించాలి ఇది శాంతి చర్చల ద్వారా సాధించబడుతోంది. మా ఆఫర్ వెనుక మరో వ్యూహం లేదు. నేను చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు కనీసం తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించడం  ఇరుపక్షాలకు అత్యవసరం. ఇది షరతు పరిధిలోకి రాదు. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో భాగమే. దీనిపై మీ స్పందన కోసం వేచి చూస్తాం.

ఈ సమస్యను పరిష్కరించడానికి నేను,కొంతమంది సహచరులు ఏమి ఆలోచిస్తున్నారో నిర్ణయించడానికి మా సెంట్రల్ కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీలోని ప్రముఖ కామ్రెడ్ లను కలవడం ఆవసరం.. చర్చలలో మాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యంతర ప్రతినిధి బృందం, మా పార్టీ ప్రతినిధులతో పాటు, అతనిని కలవడానికి నాకు, నా సహచరులకు భద్రతకు హామీ ఉండాలి. అందుకోసం ప్రభుత్వ సాయుధ బలగాల కార్యకలాపాలను నెలరోజుల పాటు నిషేధించాలని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి.

ఈ చర్చల సమయంలో ప్రభుత్వ సాయుధ బలగాలపై తుపాకులు కాల్చవద్దని మా సహచరులందరికీ పత్రికా ప్రకటనలు , ప్రత్యేక లేఖల ద్వారా నేను ఇప్పటికే విజ్ఞప్తి చేశాను. కాబట్టి, మీరు నాతో ఏకీభవించి మాతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంటే, ఛత్తీస్ గఢ్ లోఒక నెలపాటు కాల్పుల విరమణ కోసం మోహరించిన అన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వ దళాలకు ఆదేశాలు జారీ చేయండి. బస్తర్ లో హింసను వెంటనే ఆపాలని ప్రభుత్వానికి  నా విన్నపం.

భద్రతా బలగాలపై దాడి చేయవద్దని నా లేఖ (పార్టీ క్యాడర్) జారీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో భధ్రతా బలగాలు నిరంతరం దాడిచేసే ఆపరేషన్ లు జరిగాయి. ఏప్రీల్ 12న బీజాపూర్ జిల్లా భైరామ్ ఘర్ బ్లాక్ పరిధిలోని ఇంద్రావతి నది ఒడ్డున అనిల్ పూనెంతో సహా ముగ్గురిని పట్టుకుని చంపారు. ఏప్రిల్ 16న కొండకాన్ జిల్లాలోని కిల్లెం సమీపంలో డిఏసీ సభ్యుడు హోల్డర్ తో సహా ఇద్దరు వ్యక్తులు  మరణించారు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఈ మారణకాండలు ఇలాగే కొనసాగితే శాంతి చర్చల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఉపయోగపడవు, కావున శాంతి చర్చలు ముందుకు సాగేలా శాశ్వత పరిష్కారం లభించేలా వీటన్నింటికి స్వస్తి పలకాలని ప్రభుత్వాన్ని, విజయ్ శర్మను మరోసారి అభ్యర్థిస్తున్నాను.

సమస్యను పరిష్కరించడానికి మా న్యాయమైన డిమాండ్ కు మద్ధతు ఇవ్వాలని దేశంలోని ప్రజాస్వామ్య ప్రేమికులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము.

గమనిక : నా మొదటి పత్రికా ప్రకటనకు ప్రతిస్పందిస్తూ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాకు వ్యతిరేకంగా చేసిన అంశాలకు నేను ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం నేను ఒకే అంశంపై దృష్టి కేంద్రికరిస్తున్నాను. 

రూపేష్‌
నార్త్ -వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు