Gmail నుంచి Zohoకు మారిన అమిత్ షా.. దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రముఖ ఈ-మెయిల్ సర్వీస్ జోహో మెయిల్‌కు ఆయన మారారు. ఆయన కొత్త ఈ-మెయిల్ ఐడీని కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన అధికారిక, వ్యక్తిగతంగా ఇదే మెయిల్ ఉపయోగించనున్నారు.

New Update
Amit Shah

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రముఖ ఈ-మెయిల్ సర్వీస్ జోహో మెయిల్‌కు ఆయన మారారు. ఆయన కొత్త ఈ-మెయిల్ ఐడీని కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశంలో తయారైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు మద్దతునిచ్చే దిశగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలను ప్రోత్సహించడంలో భాగంగా అమిత్ షా జోహో మెయిల్‌కు మారారు. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలో తయారైన ఈ-మెయిల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తే డిజిటల్ సేఫ్టీ, డేటా సార్వభౌమత్వానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది.

ఇకపై అమిత్ షా తన అధికారిక, వ్యక్తిగతంగా ఇదే మెయిల్ ఉపయోగించనున్నారు. సాధారణంగా ప్రభుత్వ ప్రముఖులు లేదా రాజకీయ నాయకులు అంతర్జాతీయ ఈ-మెయిల్ సేవలను లేదా ప్రభుత్వ డొమైన్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, జోహో వంటి భారతీయ కంపెనీకి చెందిన ప్రైవేట్ మెయిల్ సేవకు మారడం అనేది, కేంద్ర మంత్రి స్థాయిలో ఓ అరుదైన చర్య.

జోహో అనేది చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ. జోహో మెయిల్ సేవ స్ట్రాంగ్ ఎన్‌క్రిప్షన్, ప్రైవసీ విధానాల కారణంగా ప్రసిద్ధి చెందింది. అమిత్ షా వంటి కీలక నేత ఈ సేవను ఉపయోగించడం వలన, దేశీయ టెక్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం లభించినట్లవుతుందని, భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ ప్రముఖులు, అధికారులు కూడా భారతీయ డిజిటల్ సేవలను స్వీకరించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాట్సాప్ తరహాలోనే అరెట్టే అనే ఓ మెస్సేజ్ ఫ్లాట్‌ఫామ్‌ను కూడా తీసుకువచ్చింది. అది కూడా కూడా వాట్సాప్‌కు గట్టి పోటీ ఇస్తోంది.

Advertisment
తాజా కథనాలు