Amit Shah: ఏడు రోజులు జైల్లో ఉన్నా: అమిత్‌ షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా జైల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్‌గా ఉండే సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నానని.. ఆ సమయంలో తనని 7 రోజులు జైల్లో పెట్టారని అన్నారు.

New Update
Amit Shah

Amit Shah

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అస్సాంలో అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా జైల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్‌గా ఉండే సమయంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నానని.. ఆ సమయంలో తనని జైల్లో పెట్టారని అన్నారు. అప్పడు తనపట్ల కఠినంగా వ్యవహరించినట్లు చెప్పారు. అస్సాంలోని డెర్గావ్‌లో లచిత్‌ బర్ఫుకాన్ పోలీసు అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.  

Also read: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు.. భగ్గుమన్న బీజేపీ

'' అస్సాంలో అప్పుడు హితేశ్వర్ సైకియా సీఎంగా ఉన్నారు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులందరం కలిసి ఆందోళన చేపట్టాం. ఆ సమయంలో నన్ను ఏడు రోజుల పాటు జైల్లో పెట్టారు. నాపై కఠినంగా వ్యవహరించారు. భౌతికంగా కూడా నాపై దాడి చేశారు. సైకియా అస్సాంకు రెండుసార్లు సీఎంగా ఉన్నారు. అస్సాంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు శాంతికి ఏమాత్రం కృషి చేయలేదు. మేము అధికారంలోకి వచ్చాక 10 ఏళ్లలో శాంతిభద్రలు మెరుగయ్యాయి.  

Also Read: నెక్స్ట్ హర్షసాయి.. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్!

10 వేల మంది యువత ఆయుధాలు వీడియ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ పోలీసు అకాడమీకి లచినత్‌ బర్ఫకన్‌ పేరు పెట్టినందుకు సీఎం హిమంతబిశ్వ శర్మకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొఘలుల పాలన, వాళ్ల దాష్టీకాలను ఎదుర్కొన్న వాళ్లలో లచిత్ బర్ఫుకన్‌ ఒకరు. ఆయన చరిత్ర కేవలం అస్సాం మాత్రమే పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా తెలియాల్సిన అవసరం ఉందని'' అమత్ షా అన్నారు. 

Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్‌ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

Advertisment
తాజా కథనాలు