Spam Messages: స్పామ్‌ మెసేజ్‌లు అరికట్టేందుకు ఎయిర్‌టెల్, గూగుల్‌ కీలక నిర్ణయం..

ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లకు స్పామ్‌ మెసేజ్‌లు రావడం పెరిగిపోయింది. వీటిని అరికట్టేందుకు భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్‌ను వినియోగించనుంది.

New Update
Airtel, Google partner to check spam in messages with web link

Airtel, Google partner to check spam in messages with web link

ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లకు స్పామ్‌ మెసేజ్‌లు రావడం పెరిగిపోయింది. వీటిని అరికట్టేందుకు భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్‌ను వినియోగించనుంది. గూగుల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చే వెబ్‌లింక్‌లను ఇది పరిశీలిస్తుంది.  ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఇంటెలిజెన్స్‌తో గూగుల్‌కు చెందిన రిచ్‌ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ (RCS) భాగస్వామ్యంతో ఈ స్పామ్‌ మెసేజ్‌లను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. 

Also read: పశ్చిమ బెంగాల్‌లో 50 లక్షలకు పైగా చొరబాటుదారులు.. వెలుగులోకి సంచలన నిజాలు

మోసపూరిత మెసేజ్‌లను అరికట్టడంతో పాటు హై క్వాలిటీ ఫొటోలు/వీడియోలు, ఇంటరాక్టివ్ మెసేజ్‌లు వినియోగదారులకు వెళ్తాయని ఎయిర్‌టెల్, గూగుల్ తెలిపాయి. గత ఏడాదిన్నర కాలంలో 7100 కోట్ల మోసపూరిత కాల్స్ వచ్చినట్లు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. అలాగే 290 కోట్ల మోసపూరి, ఫేక్ మెసెజ్‌లను తాము అడ్డుకున్నట్లు పేర్కొంది. 

Also Read: పెళ్లి చేసుకుంటానని ఒకడు, సాయం చేస్తానని మరొకడు అత్యాచారం.. పాపం చివరికి!

ఈమధ్య చాలామంది మోసపూరిత మెసేజ్‌లు నమ్మి సైబర్‌ నేరాలకు బలవుతున్నారు. సైబర్ కేటుగాళ్లు పంపే లింకులను నొక్కుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు ఎయిర్‌టెల్, గూగుల్‌ సంస్థలు ముందుకొచ్చాయి. ఏఐ ఆధారిత టూల్‌తో వీటికి చెక్ పెట్టనుంది.