గాలి నాణ్యత సరిగా లేదు, బయటకు వెళ్లకండి.. కేంద్రం కీలక ఆదేశాలు

శీతాకాలానికి ముందు దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉదయం పూడ నడవడం అలాగే క్రీడలు వంటి వాటికి దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

New Update
kk

శీతాకాలానికి ముందు దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. గాలి నాణ్యత తగ్గిపోవడంతో అక్కడి ప్రాంత ప్రజలు స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చలేని పరిస్థితి నెలకొంటుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాను తగలబెట్టడంతోనే ఏటా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉదయం పూడ నడవడం అలాగే క్రీడలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. 

Also Read: భారత్‌కు ఉగ్రవాది హెచ్చరిక.. రేపటి నుంచి!

ప్రజల్లో అవగాహన పెంచాలి

'' వాయు కాలుష్యం తీవ్రతరం కావడం వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. అందువలన బహిరంగ ప్రదేశల్లో ఉదయపు నడకు వెళ్లడం, క్రీడలు ఆడటం లాంటి పనులకు బయటకు వెళ్లడం పరిమితం చేయాలి. మరీ ముఖ్యంగా గర్భీణీలు, వృద్ధులు, పిల్లలు, అలాగే ట్రాఫిక్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థతుల దృష్ట్యా..' వాతావరణ మార్పు-మానవులపై ప్రభావం' జాతీయ కార్యక్రమాన్ని చేపట్టాలి. దీనిపై ప్రజలకు అవగాహన కలిగించాలి. అలాగే గాలి కాలుష్య సంబంధిత వ్యాధులను ట్రాక్ చేసే నిఘా వ్యవస్థలతో భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. 

Also Read: పని వారిని కూడా సొంత వారిగానే...ఆస్తులు రాసిన టాటా!

ఇవి తగ్గించుకోవడం ముఖ్యం

పంట వ్యర్థాలను కాల్చడం తగ్గించాలి. దీపావళి సమయంలో బాణాసంచాలు కాల్చడం, వ్యక్తిగత వాహనాలపై ప్రయాణాలు చేయడం, డీజీల్‌తో నడిచే జనరేట్లపై ఆధారపడటం లాంటి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. వ్యక్తులు ప్రభుత్వం రూపొందించిన యాప్‌ ద్వారా గాలి నాణ్యతను పర్యవేక్షించాలి. ఇప్పటికే శ్వాసకోస, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు కాలుష్యం ఎక్కువగా ఉండే సమయాల్లో బహిరంగ కార్యకలాపాలు తగ్గించాలని'' ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు