BIG BREAKING: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. విమానానికి ఇకపై ఆ నెంబర్ ఉండదు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా కంపెనీ AI 171 నెంబర్‌ని భవిష్యత్‌లో విమానాకు కేటాయించకుడదని నిర్ణయించుకుంది. దీనికి బదులుగా AI 159 నెంబర్‌ను ఈ ఫ్లైట్‌కు పేరు పెట్టనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

author-image
By K Mohan
New Update
Air India

Air India

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ నుంచి లండన్ బయలుదేరిన AI 171 ఫ్లైట్ టేకాఫ్ సమయంలో క్రాష్ అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఎయిర్ ఇండియా కంపెనీ AI 171 నెంబర్‌ని భవిష్యత్‌లో విమానాలకు కేటాయించకూడదని నిర్ణయించుకుంది.

అహ్మదాబాద్ టూ లండన్ నడిచే ఫ్లైట్లకు కొత్త నెంబర్ కేటాయించింది. AI 171కి బదులుగా AI 159 నెంబర్‌ను ఈ ఫ్లైట్‌కు పేరు పెట్టనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. జూన్ 17 నుంచి అహ్మదాబాద్ లండన్ గాట్విక్ సర్వీస్ AI 171 కు బదులుగా AI 159 కింద నడుస్తుంది. ఎయిర్‌లైన్ శుక్రవారం ఈ బుకింగ్ సిస్టమ్ మార్పులను అమలు చేసింది.

air india | flight number AI 171 with AI 159 | ahmedabad airport | ahmedabad airport plane crash | Ahmedabad-London flight crash | ahmedabad plane | latest-telugu-news

 

Advertisment
Advertisment
తాజా కథనాలు