Apache helicopter : వాయుసేన హెలికాఫ్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌..వారంలోనే రెండోసారి..

ఆహ్మదాబాద్‌ విమాన ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే వాయుసేనకి చెందిన హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎకవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

New Update
Apache helicopter

Apache helicopter

Apache helicopter : ఆహ్మదాబాద్‌ విమాన ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే వాయుసేనకి చెందిన హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం కలకలం రేపింది. దీంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనలో ఎకవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వాయుసేనకు చెందిన అటాక్‌ అపాచీ హెలికాప్టర్‌ పఠాన్‌ కోట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలో  హెలికాప్టర్‌ను దింపాల్సి వచ్చింది. పఠాన్‌కోట్‌ లోని  వైమానిక దళ కేంద్రం నుంచి బయల్దేరిన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. దీంతో  ముందు జాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం వల్ల  ప్రజా భద్రత, మౌలిక సదుపాయాలకు ఎటువంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు.  విషయం తెలిసిన వెంటనే పలువురు వైమానిక దళ అధికారులు, సాంకేతిక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. హెలికాప్టర్‌ దిగగానే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అయితే, వాయుసేన హెలికాప్టర్లు ఇలా ల్యాండ్‌ అవడం ఇదే తొలిసారి కాదు. వారం రోజుల వ్యవధిలో హెలికాప్టర్లు ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కావడం ఇది రెండోసారి. జూన్ 6న, ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ సమీపంలోని ఒక పొలంలో ఇలాగే వాయుసేన హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ రెండు ఘటనల్లోనూ పైలట్లు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

ఏప్రిల్‌లో జామ్‌నగర్‌లోని  చెంగా గ్రామంలో భారత వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్‌ అత్యవసరగా దించారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ను అత్యవసరంగా కిందకు దించినట్లు నాడు అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో కూడా లద్ధాఖ్‌లో నిర్వహిస్తున్న యుద్ధ శిక్షణలో  హెలికాప్టర్‌ దెబ్బతినడంతో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ అటాక్‌ హెలికాప్టర్‌గా పేరున్న అపాచీ హెలికాప్టర్ల లో తరుచుగా ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన వీటి కొనుగోలుకు 2015లో భారత్‌, అమెరికాతో ఒప్పందం చేసుకొంది. ఈ డీల్‌ విలువ రూ.13,952 కోట్లు. భారత సైన్యంలో ఈ హెలికాప్టర్లు అంత్యంత ముఖ్యమైనవిగా గుర్తింపు పొందాయి. అయితే ఇలా తరుచుగా ప్రమాదాలకు గురికావడం మాత్రం కొంత ఆందోళన కలిగించే విషయమని విశ్రాంత ఆర్మీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు