Hyderabad: సాంకేతిక లోపంతో గాల్లో చక్కర్లు కొట్టిన ఆర్మీ విమానం.. చివరికి
హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ శిక్షణ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. ఆ విమానం హైడ్రాలిక్ వీల్స్ తెరుచుకోకపోవడంతో.. దాదాపు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి బేగంపేట ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.