AIDS Day: ఎయిడ్స్ దినోత్సవం.. తగ్గుతున్న కేసులు

ప్రజల్లో అవగాహన పెరగడం, హైచ్‌ఐవీ రోగులను గుర్తించి చికిత్స అందించడం వల్ల ఎయిడ్స్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారత్‌లో 2010 నుంచి హెచ్‌ఐవీ వ్యాప్తి రేటు 44 శాతం తగ్గినట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి తెలిపారు.

New Update
AIDS

ఎయిడ్స్.. ఒకప్పుడు ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు. ఈ వ్యాధి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే పరిస్థితులు మారిపోయాయి. ప్రజల్లో అవగాహన పెరగడం, హైచ్‌ఐవీ రోగులను గుర్తించి చికిత్స అందించడం వల్ల ఎయిడ్స్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 15 నుంచి 49 ఏళ్ల వయసు గలవారిలో హెచ్‌ఐవీ వ్యాప్తి రేటు దేశంలో 0.20 శాతంగా ఉంది. తెలంగాణలో 0.44 శాతంగా ఉంది. 2020లో HIV వ్యాప్తి 0.48 శాతం ఉండగా.. ప్రతీ ఏడాది తగ్గుతూ వచ్చింది. 2024-25లో 0.44 శాతానికి తగ్గింది. డిసెంబర్ 1న ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read: రూ. 295 కోసం ఏడేళ్ల పోరాటం..చివరికి ఏమైందంటే!

Also Read:  BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..

AIDS Cases Declining In India

ప్రస్తుతానికి దేశంలో 25 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారని జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (నాక్స్) వెల్లడించింది. ఎయిడ్స్ వ్యాప్తిలో మిజోరం మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో మణిపుర్, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఇక తెలంగాణ ఐదో స్థానంలో  ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 1.40 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పేర్కొంది. హెచ్‌ఐవీ వైరస్, ఎయిడ్స్ సోకిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మందులను 'యాంటీ రెట్రో వైరల్ థెరపీ సెంటర్స్(IRT) ద్వారా సరఫరా చేస్తున్నట్లు సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.హైమావతి చెప్పారు. ఇక భారత్‌లో 2010 నుంచి హెచ్‌ఐవీ వ్యాప్తి రేటు 44 శాతం తగ్గినట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ ప్రకటించారు. 

Also Read: కోర్టు సంచలన తీర్పు.. 141 ఏళ్లు జైలు శిక్ష.. ఎందుకంటే?

Also Read: Ukraine: ఇంక చేయలేము..చేతులెత్తేస్తున్న ఉక్రెయిన్ సైనికులు

2024-25లో దేశవ్యాప్తంగా హెచ్‌ఐవీ రోగుల సంఖ్య తగ్గే ఛాన్స్ ఉన్నట్లు నాక్స్ చెబుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ 31 వరకు ఏడు నెలల్లో తెలంగాణలో 9,56,713 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా.. 5,363 మందికి పాజిటివ్‌ వచ్చింది. 3,37,752 మంది గర్భిణులకు టెస్టులు చేయగా.. 427 మంది HIV బారిన పడ్డారు. హైదరాబాద్‌లోనే అత్యధికంగా 902 హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2023-24లో సుమారు 20 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 11,086 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. క్రమం తప్పకుండా మందులు వాడుతూ రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకుంటే HIV వచ్చినా కూడా సాధారణ జీవితం గడపొచ్చని వైద్యులు చెబుతున్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు