Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. మృతుల వివరాలు వెల్లడించిన గుజరాత్‌ ఆరోగ్యశాఖ

ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుజరాత్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 241 మంది ప్రయాణికులు, 34 మంది స్థానికులు ఉన్నట్లు తెలిపింది. వారిలో వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు.

New Update
Ahmedabad Plane Crash Gujarat govt deceased Details revealed

Ahmedabad Plane Crash Gujarat govt deceased Details revealed

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎవరూ ఊహించని ఈ ఘోర ప్రమాదంలో వదల మంది ప్రయాణికులు, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను తాజాగా గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Ahmedabad Plane Crash

ఈ ప్రమాదంలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అందులో 241 మంది ప్రయాణికులు.. అలాగే 34 మంది స్థానికులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మొదటిసారి అఫీషియల్‌గా ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరి డెడ్‌బాడీలను స్వాధీనం చేసుకున్న తర్వాత అధికారులు డీఎన్ఏ టెస్టులు చేసిన విషయం తెలిసిందే. 

ఇందులో ఇప్పటి వరకు 260 మంది మృతదేహాలను గుర్తించారు. మరో 6గురిని ముఖాలతోనే నిర్ధారించారు. ఇక మృతులలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులు ఉన్నారు. అందులో ఇప్పటి వరకు 256 డెడ్ బాడీలను బాధిత కుటుంబాలకు అప్పగించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు