/rtv/media/media_files/2025/04/21/nJz5mh4BGr7s9Yhst1H3.jpg)
Cybercrime
Cybercrime: మనం ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీలు చేయడం లేదు. కనుక మన బ్యాంక్ ఖాతాలు సేఫ్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరగాళ్లకు చేరుతున్నాయంటే నమ్ముతారా? నమ్మిన నమ్మక పోయిన ఇది నిజం. మన బ్యాంక్ ఖాతాలు మనకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లకు చేతికి చిక్కుతున్నాయి. కాదు..కాదు అమ్ముడు పోతున్నాయి. అవును కమీషన్ పద్ధతిలో మన బ్యాంక్ ఖాతాలకు సైబర్ ముఠాలకు అమ్ముకుంటున్నారు. మనకు తెలియకుండానే మన ఖాతా నుంచి లావాదేవీలు చేసుకుంటున్నారు.తాజాగా ఇలాంటి నేరగాడినే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: BIG BREAKING: తిరుమలలో అగ్ని ప్రమాదం!
నవీ ముంబైలో ఉంటున్న రష్మిత్ రాజేంద్ర పాటిల్ అనే 22 ఏళ్ల యువకున్ని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకు ఈ యువకుడు చేస్తున్న పనేమిటంటే సైబర్ నేరగాళ్లకు కమీషన్ పద్ధతిలో బ్యాంకు ఖాతాలు సమకూర్చుతూ సహకరించడం. ఎందుకంటే సులభంగా డబ్బులు సంపాదించడానికి. అవును తన అవసరాలకు డబ్బులు సంపాదించడం కోసం సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి వారికి బ్యాంకు ఖాతాలు సమకూర్చడం మొదలుపెట్టాడు. సైబర్ నేరగాళ్లు తాము మోసం చేసి కాజేసిన సొమ్మును రష్మిత్ ఇచ్చిన ఖాతాలకు బదిలీ చేస్తారు. వాటిలోకి వచ్చిన డబ్బులో కొంత కమీషన్ తీసుకొని మిగతా డబ్బును వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేస్తాడీయువకుడు. ఇలా ఇప్పటికే పలువురి ఖాతాలను ఈ ముఠా లూటీ చేసింది.
ఇది కూడా చూడండి: Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
కాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో మోసం చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన నుంచి రూ.2.43 కోట్లు కాజేశారు. ఈ డబ్బును రష్మిత్ అందించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించారు. బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రష్మిత్ సమకూర్చిన బ్యాంకు ఖాతాల్లో బాధితుడి డబ్బు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. సైబర్ క్రైం డీసీపీ కవిత దార ఆదేశాల మేరకు సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ పి. ప్రమోద్, ఎస్సై షేక్ అజీజ్‌ల బృందం ముంబై వెళ్లి నిందితుడు రష్మిత్‌ను అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. ఇప్పటివరకు ఎంత కోట్లు ఇలా కొల్లగొట్టారు. రష్మిత్ వెనుకున్న సైబర్ నేరగాళ్లు ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.
ఇది కూడా చూడండి: TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై స్నేహితుడుని నరికిన యువకుడు