BREAKING: ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్లో బాలుడి మృతి.. మరో నలుగురికి..

మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. సిన్నార్ బస్టాండులో ఫ్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ప్రయాణికులపై ఒక్కసారిగా బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
a boy dies after Bus rams into passengers in Maharashtra

a boy dies after Bus rams into passengers in Maharashtra

మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. సిన్నార్ బస్టాండులో ఫ్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ప్రయాణికులపై ఒక్కసారిగా బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న సిబ్బంది క్షతగాత్రును ఆస్పత్రికి తరిలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్

ఇదిలాఉండగా హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో మరో దారుణం జరిగింది. కీర్తి అపార్ట్‌మెంట్స్‌ లిఫ్ట్‌లో ఇరుకొన్ని ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అపార్ట్‌మెంట్‌ అయిదవ ఫ్లోర్‌లో నరసు నాయుడు తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడి చిన్న కుమారుడు స్కూల్‌ నుంచి వచ్చాక లిఫ్ట్‌లో అయిదో ఫ్లోర్‌కి వెళ్లాడు. తిరిగి కిందకు వచ్చే క్రమంలో 4,5 ఫ్లోర్‌ మధ్య ఆ బాలుడు ఇరుక్కుపోయాడు. సిబ్బంది బయటికి ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు