Fire Accident: మెడికల్ గోడౌన్ లో మంటలు.. రూ. 5 కోట్ల పైనే నష్టం!
విజయవాడ బందర్ రోడ్ లోని కేడీసీసీ బ్యాంకు ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు.