ఇంటర్ పోల్...ఇంటర్నేషనల్ క్రిమినల్స్, భారత్ నుంచి విదేశాలకు పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు దీనిని ఉపయోగిస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దీనిని చూసుకుంటుంది. భారత్‌లోని నేరాల దర్యాప్తులు, నేరస్థుల సమాచారాన్ని ఇతర దేశాల ఇంటర్‌పోల్ విభాగాలతో సీబీఐ షేర్ చేస్తుంది. విదేశాలకు పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు రెడ్‌కార్నర్, ఆచూకీ లభించని వారికి ఎల్లో నోటీసులు, వ్యక్తుల గుర్తింపు, నివాసం వంటి సమాచారం కోసం బ్లూ నోటీసులు అవసరమవుతాయి.ఈ-మెయిల్, ఫ్యాక్స్, లేఖల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్‌పోల్ సాయంతో 2021 నుంచి 100 మంది వాంటెడ్ జాబితాలో ఉన్న నేరస్థులను భారత్‌కు తీసుకురాగా.. 2024లో 26 మందిని తీసుకువచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. భారత్ పోల్.. అయితే ఈ ప్రక్రియ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాదు చాలా సమయం కూడా పట్టేస్తోంది. వీటిని ధిగమించడానికే సీబీఐ ఇప్పుడు ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ వేదికు రూపొందించనుంది. దీనికి భారత్ పోల్ అని పేరు పెట్టింది. దీనివలన ప్రాసెసింగ్ సమయం తగ్గడంతోపాటు ప్రతి కేసు అప్‌డేట్‌ను తేలికగా పర్యవేక్షించే వీలుంటుందని సీబీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇది ట్రయల్ మోడ్లో ఉంది. జనవరి 7న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. Also Read: నిలిచిపోయిన అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలు ..తీవ్ర నిరాశలో ప్రయాణికులు