Road Accient: ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొన్న కారు.. అయిదుగురు మృతి

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ పైనుంచి దూకిన కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న అయిదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

New Update
5 die in Bengaluru after car jumps divider, hits Karnataka state transport bus

5 die in Bengaluru after car jumps divider, hits Karnataka state transport bus

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ పైనుంచి దూకిన కారు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న  అయిదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే బెంగళూరులో శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. డివైడర్‌ నుంచి జంప్ చేసి మరోలైన్‌లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న అయిదుగురు యువకులు మృతి చెందారు.  

Also Read: అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై రాహుల్‌ గాంధీ కీలక ప్రశ్నలు

సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా వాళ్లందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. వాళ్లని మరో బస్సులో తమ గమ్యస్థానాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన యువకుల వయస్సు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. 

Also Read: కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బిగ్‌ ట్విస్ట్‌..కాంగ్రెస్‌లో చేరిన స్వతంత్రులు

కారు నడిపిన వ్యక్తి, ఇతరులు మద్యం సేవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మృతుల రక్త నమూనాలు పరీక్షల కోసం పంపించినట్లు వెల్లడించారు. యువకులు మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.  

Advertisment
తాజా కథనాలు