Gujarat Bridge Collapse: గుజరాత్‌లో కుప్పకూలిన మరో వంతెన.. ముగ్గురు మృతి

గుజరాత్‌లో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో వంతెన కుప్పకూలింది.  వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కూలిపోయింది. అకస్మాత్తుగా వంతెన  కూలిపోవడంతో వాహనాలు, ప్రయాణికులు నదిలో పడిపోయారు.

New Update
bridge-collopse

Gujarat Bridge Collapse

Gujarat Bridge Collapse: గుజరాత్‌లో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో వంతెన కుప్పకూలింది.  వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి(Gambhira Bridge) కూలిపోయింది. అకస్మాత్తుగా వంతెన  కూలిపోవడంతో వాహనాలు, ప్రయాణికులు నదిలో పడిపోయారు. దీంతో రెస్క్యూ అపరేషన్ కొనసాగుతుంది.  

Also Read: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

ముగ్గురు మృతి

బ్రిడ్జి కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.  వడోదర - ఆనంద్ జిల్లాలను కలుపుతూ గంభీర బ్రిడ్జి నిర్మించారు.  ఇప్పుడు  బ్రిడ్జి కూలడంతో ఆనంద్, వడోదర, భారూచ్, అంకాళేశ్వర్ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.   రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి. ఇప్పటివరకు నలుగురిని రక్షించామని పద్రా పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ చరణ్ తెలిపారు. 

Also Read: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

Also Read: నితీశ్‌ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు