Crime: దారుణం.. ఏడాదిగా బాలికపై అత్యాచారం, 8 మంది అరెస్టు

సిక్కింలో గ్యాల్‌షింగ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ మైనర్‌ బాలికపై ఏకంగా ఏడాదిగా అత్యాచారం జరిగింది. చివరికి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఫిర్యాదు మేరకు నలుగురు బాలురతో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

New Update
8 Arrested For Raping 13-Year-Old Sikkim Girl For Months

8 Arrested For Raping 13-Year-Old Sikkim Girl For Months

సిక్కింలో గ్యాల్‌షింగ్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ మైనర్‌ బాలికపై ఏకంగా ఏడాదిగా అత్యాచారం జరిగింది. చివరికి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఫిర్యాదు మేరకు నలుగురు బాలురతో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకి అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. జిల్లాలోని 13 ఏళ్ల బాలికను ఓ మహిళ పనుల్లో సాయం చేసేందుకు ప్రతిరోజూ తన ఇంటికి తీసుకెళ్లేది. ఆ తర్వాత బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది.  

Also Read: వేలంలో ‘గోల్కొండ బ్లూ’ వజ్రం.. దీని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడమే

మహిళ భర్త, మరో ఇద్దరు వ్యక్తులతో పాటు నలుగురు బాలురు ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆ బాలిక ఎప్పుడు చూసిన అనారోగ్యంగా ఉండేది. దీంతో ఓసారి టీచర్‌ ఆమెను గమనించింది. అంతేకాదు ఆ బాలిక ఎవరితో కూడా క్లాస్‌ మాట్లాడకుండా మౌనంగా కనపించేది. దీంతో ఏం జరిగిందని టీచర్‌ ఆ బాలికను అడిగింది. చివరికి ఆ బాలిక తనకు జరిగిన విషయాన్ని చెప్పింది. ఏడాదిగా తనపై లైంగిక దాడులు జరుగుతున్నాయని తెలిపింది. 

Also Read: చచ్చాడు వెధవ.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన కామాంధుడు-గంటల వ్యవధిలో ఎన్‌కౌంటర్

దీంతో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి ఆ పాఠశాల సమాచారం అందించింది.  ఆ సంస్థ ఏప్రిల్ 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మహిళ, ఆమె భర్త, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నలుగురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చైల్డ్‌ వెల్ఫేర్ కమిటీ బాధిత బాలికకు చికిత్స అందించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 

 sikkim | telugu-news | rtv-news | national-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు