/rtv/media/media_files/2026/02/03/up-women-2026-02-03-20-17-34.jpg)
సామాన్యుల సమస్యలు అధికారులకి విన్నవించినా పట్టించుకోకపోతే ఏం చేయాలి? వినతులు ఇచ్చి అలసిపోవాలా? లేక కొత్తగా ఆలోచించాలా? ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఒక మహిళ రెండో ఆప్షన్ ఎంచుకుంది. తన ఏరియాలో ఎన్నాళ్ల నుంచో పేరుకుపోయిన మురికిని వదిలించడానికి ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
కేకలు వేస్తూ పోలీసులకు ఫోన్
మీరట్లో ఒక మహిళ గట్టిగా కేకలు వేస్తూ పోలీసులకు ఫోన్ చేసింది. నా బిడ్డ డ్రైనేజీలో పడిపోయాడు.. కాపాడండంటూ ఫోన్ చేసింది. ఇంకేముంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, భారీ క్రేన్లు, జెసిబిలతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు మురికి కాలువను జల్లెడ పట్టారు. అందులో ఉన్న చెత్తాచెదారం, పూడిక మొత్తాన్ని బయటకు తీశారు.
In India, a woman tricked police and civic teams into cleaning an open drain for three hours by falsely claiming someone had fallen into it. pic.twitter.com/q56tmilga8
— non aesthetic things (@PicturesFoIder) February 3, 2026
డ్రెయిన్ అంతా క్లీన్ అయ్యాక చూస్తే అక్కడ ఏ బాబు లేడు. అసలు ఎవరూ పడలేదని తేలింది. డ్రెయిన్ క్లీన్ చేయమని ఎన్నిసార్లు అడిగినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో, ఆ మహిళ ఈ రేంజ్ లో డ్రామా ఆడాల్సి వచ్చిందని తెలిసింది. ప్రాణం మీదకు వచ్చిందంటే గానీ అధికారులు కదలరని ఆమె ఈ పని చేసింది. తీరా చూస్తే, ఆ డ్రెయిన్ ఇప్పుడు అద్దంలా మెరిసిపోతోంది.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తెలివైన పని.. మన దేశంలో పనులు జరగాలంటే ఇలాంటి తెలివితేటలు ఉండాల్సిందేనని మెచ్చుకుంటున్నారు.మరికొందరు మాత్రం రేపు నిజంగా ఎవరైనా పడిపోయినా పోలీసులు నమ్మని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఏది ఏమైనా ఓ సామాన్యుడు ఇంత పెద్ద అబద్ధం ఆడాల్సి వచ్చిందంటే, మన వ్యవస్థలో లోపం ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Follow Us