BREAKING: మళ్లీ ఉగ్రదాడుల కుట్ర.. ముగ్గురు అరెస్టు

ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) అధికారులు ఉగ్రదాడుల కుట్రను భగ్నం చేశారు. పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.

New Update
3 ISIS Terrorists Arrested From Gujarat For Planning Attacks In India

3 ISIS Terrorists Arrested From Gujarat For Planning Attacks In India

ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) అధికారులు ఉగ్రదాడుల కుట్రను భగ్నం చేశారు. పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. గతేడాది నుంచి వాళ్లపై నిఘా ఉంచామని.. ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వాళ్లపై ఆరోపణలు ఉన్నాయని ఏటీఎస్‌ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read: అండమాన్‌& నికోబార్ దీవుల్లో భారీ భూకంపం

ఈ ఏడాది ప్రారంభంలో అయిదుగురు అల్‌ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వాళ్లు ఆన్‌లైన్‌లో టెర్రర్‌ మాడ్యుల్‌ను నడుపుతున్నారు. అలాగే పాకిస్థాన్‌లో ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న ఓ మహిళ వాళ్లలో ఉంది. మరోవైపు పాక్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఇద్దరు SPOలను తొలగించారు.

Also Read: పశ్చిమబెంగాల్‌లో మరో దారుణం..అమ్మమ్మ ఒడినుంచి చిన్నారిని కిడ్నాప్‌ చేసి ఆపై....

అయితే ఉగ్రవాదుల కార్యకలాపాలకు వీళ్లు సాయం చేస్తున్నట్లు బయటపడంతో వాళ్లని తొలగించినట్లు అధికారులు చెప్పారు. SPOలు అబ్దుల్ లతీఫ్, మహ్మద్‌ అబ్బాస్‌గా గుర్తించారు. వీళ్లపై FIR నమోదు చేసి దోడా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు