/rtv/media/media_files/2024/12/07/yenZcSTdr9bOl02sqRLV.jpg)
యువకుడు ప్రియురాలిని మోసం చేసి 2 కోట్ల 50 లక్షలు కాజేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి 20ఏళ్ల యువతిని చీట్ చేశాడు మోహన్ కుమార్. గర్ల్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. అలా బ్లాక్ మెయిల్ చేస్తూ యువతి దగ్గర నుంచి ఇప్పటి వరకు రెండు కోట్ల క్యాష్, ఖరీదైన కార్లు, వస్తువులు గిఫ్ట్ ల రూపంలో బలవంతంగా తీసుకున్నాడు. మోహన్ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక యువతి బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆమె పేరెంట్స్ అకౌంట్స్ నుంచి డ్రా చేసి ఇప్పటి వరకు మోహన్ కుమార్ కు డబ్బులు ఇస్తూనే వచ్చింది.
READ ALSO : భూదాన్ పోచంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ముందే జాగ్రత్తగా వీడియోల్లో మోహన్ ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. వాటిని చూపించి సోషల్ మీడియా, ఇంటర్ నెట్లో అప్లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆమె ఆభరణాలు, ఖరీదైన వాచ్ లు, కారు ఇలా లక్షల విలువ చేసే వస్తువులను మోహన్ కు ఇచ్చినట్లు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు ఫైల్ చేసి మోహన్ ని అరెస్ట్ చేశారు. బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్న డబ్బులో రూ.80 లక్షలు వరకూ అతని దగ్గర నుంచి పోలీసులు రికవరీ చేశారు.
READ ALSO :Google Maps: మరోసారి దారి తప్పించిన గూగుల్ తల్లి..ఈసారి అడవి పాలు!
ఇద్దరూ బోర్డింగ్ స్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ల స్నేహం ప్రేమగా మారింది. ధనవంతురాలై యువతి గురించి తెలుసుకొని మోహన్ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ ప్లాన్ వేశాడు. ఒకసారి రూ.1.25 కోట్లు, మరో సారి రూ.1.32 కోట్లు యువతి రహస్యంగా విత్‌డ్రా చేసి అతనికి ఇచ్చింది. మొత్తం రూ.2.57 కోట్ల బ్లాక్ మెయిల్ చేసి యువతి నుంచి తీసుకున్నాడని బెంగుళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు.
ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య
ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు