Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లోని అఖ్‌నూర్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిని భారత సైనిక దళానికి చెందిన వైట్‌ నైట్‌ కార్ప్స్ నిర్ధరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది.

New Update
Indian Army

Indian Army

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని అఖ్‌నూర్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిని భారత సైనిక దళానికి చెందిన వైట్‌ నైట్‌ కార్ప్స్ నిర్ధరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. 

Also Read:  నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!

''అఖ్‌నూర్‌లోని లలీలిలో సైనికులు ఫెన్స్‌ పెట్రోలింగ్‌ చేస్తుండగా అనుమానస్పద ఐఈడీ బాంబు పేలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సైనిక దళాలు సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించాయి. సైనికుల త్యాగాలను వైట్ నైట్‌ కార్ప్స్‌ నివాళులర్పిస్తోందని'' రాసుకొచ్చింది.

ఇదిలాఉండగా ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నార్త్ జమ్మూ కశ్మీర్‌లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ జవాన్ కార్తీక్ తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఆ తర్వాత ఆయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ కార్తీక్ సోమవారం తుదిశ్వాస విడిచారు. కార్తీక్ స్వస్థలం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం. రాగిమాను పెంట.  

Also Read: ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్‌ కట్‌.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?

Advertisment
తాజా కథనాలు