Uttarakhand : దారుణం.. ఆర్టీసీ బస్సులో బాలికపై గ్యాంగ్ రేప్
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మరో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో టీనేజ్ బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ఘటన తర్వాత ఒంటరిగా ఉన్న బాలికను చూసిన స్థానికులు శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.