Terrorist Firing:
జమ్మూ–కాశ్మీర్‌లో మళ్ళీ టెర్రరిస్టులు వల కార్మికులపై కాల్పులకు తెగబడ్డారు. కాశ్మీర్ లోని బుద్గామ్ జిల్ల మగామ్ లో ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స కోసం శ్రీనగర్‌లోని జెవిసి ఆసుపత్రి బెమీనాలో చేర్చారు. ప్రస్తుతం కూలీల పరిస్థితి నిలకడగా ఉందని భద్రతా బలగాలు తెలిపాయి. సోఫియాన్, ఉస్మాన్ అనే ఇద్దరు కూలీలు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. సెప్టెంబర్ లో టెర్రరిస్టుల కాల్పుల కారణంగా ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. గత 15 రోజుల్లో వలస కార్మికులపై రెండోసారి కాల్పులు జరిగాయి.
Also Read: AP: గోదావరి పుష్కరాల తేదీ ఖరారు..ఈసారి ప్రత్యేకతలు ఇవే..
Also Read: Fashion: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత
కాల్పులు జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెప్టెంబర్‌లో గందర్‌బల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు ఇలానే కాల్పులు జరిపారు. అప్పుడు ఓ డాక్టర్, ఆరుగురు వలస కార్మికులు మరణించారు. ఇది జరిగి కేవలం12 రోజులు మాత్రమే అవుతుంది. అంతకు ముందు అక్టోబర్ 18న కూడా బీహార్ కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చారు. ఇలా వరుసగా తీవ్రవాదులు వలస కార్మికులను టార్గెట్ చేసి చంపుతున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలకు అటంకాలు కలిగించాలనే ఉద్దేశ్యంతోనే జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు కార్మికులపై కాల్పులు చేస్తున్నారని ఇండియన్ ఆర్మీ చెబుతోంది.
Also Read: Movies: కూతురు పేరును ప్రకటించిన దీపికా-రణవీర్..అర్ధం ఇదే..