IPL 2025:కేఎల్ రాహుల్ రిలీజ్..ఓనర్ సంజీవ్ గోయెంకా అనుచిత వ్యాఖ్యలు

ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్ ఐపీఎల్ రిటెన్షన్. ప్రతీ టీమ్‌కు సంబంధించి ఒక్కో న్యూస్ వస్తోంది. తాజాగా ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వ్యక్తిగత లక్ష్యాలు అంటూ ఆయన అన్న మాటలపై అందరూ మండిపడుతున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
0

LSG Owner Sanjeev Goenka: 

ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితాలో స్టార్ క్రికెటర్ కె ఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. ఇది చాలా పెద్ద సంచలన విషయం. దానికి తోడ కేఎల్ రాహుల్ గత సీజన్‌లో ఆడిన ఎల్‌ఎస్‌జీ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు ఇంకా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆటగాళ్ల ఎంపికలో మేము ఒక్కటే విషయాన్ని పరిగణనలోకి తీసుకొన్నాం. గెలవాలన్న లక్ష్యంతో ఉన్నవారినే ఎంపిక చేశాం. వ్యక్తిగత లక్ష్యాలకు దూరంగా జట్టు విజయం కోసం శ్రమించేవారికే ప్రాధాన్యమిచ్చాం అని సంజీవ్ అన్నారు. దీని మీద కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు క్రికెట్ లవర్స్ అందరూ మండిపడుతున్నారు.  

Also Read: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోకి నార్త్ కొరియా బలగాలు–ధృవీకరించిన​ అమెరికా

అయితే ఎల్‌స్‌జీ జట్టులో నికోలస్‌ పూరన్‌, రవి బిష్ణోయ్‌, మయాంక్‌ యాదవ్‌, మొహసిన్‌ ఖాన్‌ వంటి వారిని జట్టులో కొనసాగించింది. మా తొలి రిటెన్షన్‌ నిర్ణయం కేవలం రెండు నిమిషాల్లోనే తీసుకొన్నాం. మేము అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు మొహసిన్‌ ఖాన్‌, ఆయుష్‌ బదోనిని కూడా కొనసాగించాము. జహీర్‌ఖాన్‌, జస్టిన్‌లాంగర్‌, సీఈవో, అనలిస్ట్‌ అందరం కలసి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  గత సీజన్‌లోని ముగ్గురు భారతీయ బౌలర్లు మాకు అవసరం. పూరన్‌ ఎంపికలో రెండో ఆలోచనకు తావులేదు. ఇక  6, 7 స్థానాల్లో ఆయుష్‌ మాకు బాగా ఉపయోగపడ్డాడు అంటూ సంజీవ్ ఎప్పుకొచ్చారు. కానీ కేఎల్ రాహుల్ ను మాత్రం వదిలేశారు. పైగా ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పలేదు. దానితోడు వ్యక్తిగత లక్ష్యాలు అంటూ వ్యాఖ్యలు కూడా  చేశారు.  ఇప్పుడు ఇదే విషయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రాహుల్ జట్టు కోసమే ఆడాడని వెనకేసుకొచ్చారు. అసలు ఇలాంటి మాటలు ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: National: ఈసీకి స్వతంత్రత లేదు–‌‌కాంగ్రెస్ లేఖ

గత ఐపీఎల్‌లో హైదరాబాద్‌తో మ్యాచ్‌ తర్వా సంజీవ్‌-కేఎల్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది డైరెక్ట్‌గా లైవ్‌లో ప్రసారమైంది. ఆ తర్వాత ఆ క్లిప్ చాలా వైరల్‌ కావడంతో చాలామంది గొయెంకా తీరును తప్పుపట్టారు. కెప్టెన్‌తో మైదానంలో వాదనకు దిగడం సరికాదని కామెంట్స చేశారు. దీంతో వారిద్దరి మధ్యా అప్పటి నుంచీ కాస్త గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తోంది.  ఆ తర్వాత గొయెంకా కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే దానిని ఆయన ఇంకా మనసులో ఉంచుకున్నాడని అనిపిస్తోంది. దానికి ఇప్పుడు కేఎల్ రాహుల్ ను తీసుకోకపోవడం ఆడ్ అవడంతో....అదే రీజన్ అని అంటున్నారు. 

 ఇది కూడా చదవండి: త్వరలో ఆ చట్టం తీసుకొస్తాం.. పవన్ సంచలన ప్రకటన!

Also Read: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు