PAK vs NZ : వారేవా పాకిస్థాన్.. న్యూజిలాండ్కు చుక్కలు చూపించింది!

న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. 205 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. కేవలం ఒక వికెట్ ను మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. అంతర్జాతీయ క్రికెట్ లో 200పైగా పరుగులను అత్యంత వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి

New Update
pak vs nz third

న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. 205 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. కేవలం ఒక వికెట్ ను మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో తొమ్మది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఓపెనర్ హసన్ నవాజ్ 105 పరుగులతో నాటౌట్ గా నిలిచి విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇందులో 10 ఫోర్లు, 7 సిక్సులున్నాయి.  అతనికి తోడుగా కెప్టెన్ సల్మాన్ అఘూ (51*) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.  

Also Read :   భర్తను చంపి భార్య ముక్కలు చేస్తే.. ఆమె ప్రియుడు తల, చేతులు తీసుకెళ్లి చేతబడి

మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 94 పరుగులు

అంతకుముందు న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 94 పరుగులు చేయడంతో కివీస్ జట్టు 204 పరగులు చేసింది.  చాప్మన్ 44 బంతుల్లో 11 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. పాకిస్తాన్ తరఫున హారిస్ రౌఫ్ (3/39), షాహీన్ షా అఫ్రిది (2/36), అబ్రార్ అహ్మద్ (2/43), అబ్బాస్ అఫ్రిది (2/24), షాదాబ్ ఖాన్ (1/33) వికెట్లు తీశారు. కాగా అంతర్జాతీయ క్రికెట్ లో 200పైగా పరుగులను అత్యంత వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో పాక్ కు ఇదే మొదటి విజయం. తొలి టీ20లో 91 పరుగులకే చాప చుట్టేసిన పాక్.. రెండో టీ20లో 135 పరుగులు చేసి ఓడింది. 

Also Read :   బెట్టింగ్ యాప్స్ కేసు.. హర్షసాయి ఆడియో లీక్- ఇమ్రాన్, అన్వేష్ పై సంచలన వ్యాఖ్యలు!

Advertisment
తాజా కథనాలు