Betting App Case: బాలకృష్ణ షోతో నా జీవితం నాశనం.. రూ.80 లక్షలు పోగొట్టుకున్నా.. నెల్లూరు బాధితుడి సంచలన ఇంటర్వ్యూ!

ఆన్‌లైన్ గేమ్‌లో రూ.80లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తెలిపాడు. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో చూసి ‘ఫన్ 88’ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. మొదట నెలన్నరలో రూ.3లక్షలు వచ్చాయి. అలా ఆడుతూ రూ.80లక్షలు అప్పు అయిపోయాను అని పేర్కొన్నాడు.

New Update

రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సెన్సేషనల్‌గా మారింది. ముఖ్యంగా ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్, నటీ నటులపై పంజాగుట్టా, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. అందులో పంజాగుట్టలో 11 మంది ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల మీద కేసులు నమోదు కాగా.. మీయాపూర్‌లో 25 మంది పోలీసుల మీద కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగుట్టుకున్న బాధితులు ఉంటే.. వారు తమను సంప్రదించాలని పోలీసులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

దీంతో బెట్టింగ్ గేమింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకున్న ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ తనకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాడు. ఈ మేరకు RTVతో మాట్లాడిన ఆ వ్యక్తి సంచలన విషయాలు బయటపెట్టాడు. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో ద్వారానే బెట్టింగ్ యాప్ డౌన్‌లోడ్ చేశానని.. అలా ఏడాదికి పైగా ఆడి సర్వస్వం కోల్పోయానని అన్నాడు. బెట్టింగ్ గేమ్‌తో దాదాపు రూ.80 లక్షలు అప్పులపాలయ్యానని చెప్పుకొచ్చాడు. మరి అతడిది ఏ ఊరు.. ఎందుకు అంతలా బానిసయ్యాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని విషయాలు తెలుసుకుందాం. 

ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!

నెల్లూరు వాసి ఏమన్నాడంటే?

‘‘మాది నెల్లూరు జిల్లా, ఏఎస్ పేట మండలం, కావలాడివాలి విలేజ్. నేను మొదట్లో ఒక లేబర్ పని చేసేవాడిని. ఆ తర్వాత ఒక టెంట్ హౌస్ వ్యాపారం పెట్టుకున్నాను. దీంతో బాగా డబ్బులు సంపాదించాను. చుట్టు పక్కల గ్రామాల్లో మంచి పేరు కూడా ఉంది. అయితే అప్పట్లోనే కరోనా వచ్చింది. దీంతో వ్యాపారం మొత్తం దెబ్బతింది. నాకు ఆరోగ్యం బాగోలేక రూ.15 లక్షలు అప్పు చేశాను. తర్వాత కరోనా తర్వాత కూలి ముఠా మేస్త్రిగా ఉండి పని చేసుకున్నాను. 

Also Read :  లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

ఆ సమయంలోనే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో ‘ఫన్ 88’ బెట్టింగ్ యాప్‌ను చూశాను. ఆ తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకున్నాను. అక్కడ నుంచి గేమ్ ఆడటం మొదలు పెట్టాను. అక్కడ నుంచి దానికి బానిసయ్యాను. 2023లో ఆడటం స్టార్ట్ చేశాను. మొదట్లో డబ్బులు పెడితే బాగా లాభాలు వచ్చేవి. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్‌కు ‘ఫన్ 88’ బాక్స్‌ గిఫ్ట్ ఇస్తూ.. ఇందులో చాలా గేమ్స్ ఉంటాయ్ ఆడండి గిఫ్ట్‌లు పట్టండి అని చెప్పి ఇస్తాడు. 

సర్లే ఏదో డబ్బులు వస్తాయని గేమ్ ఆడాను. ముందు రూ.10వేలు పెడితే రూ.18వేలు వచ్చింది. బాగా డబ్బులు వచ్చాయి. అలా ఒకటిన్నర నెలల్లో రూ.3లక్షలు సంపాదించాను. ఆడుతున్న క్రమంలో డబ్బులు పోతూ వస్తూ ఉన్నాయి. ఇలా దాదాపు రూ.80 లక్షలు అప్పు అయిపోయాను.’’ అని చెప్పుకొచ్చాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు